తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై నిషేధం.

*తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై నిషేధం.*

*శ్రీవారి ఆలయ పవిత్రత, ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు తిరుమలలో రాజకీయ, ద్వేషపూరిత ప్రసంగాలను నిషేధించాలని తితిదే నిర్ణయించింది.*

*గత కొంతకాలంగా కొందరు రాజకీయ నాయకులు దర్శనానంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ రాజకీయ ప్రసంగాలు, విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. దీంతో తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణానికి ఆటంకం కలుగుతోంది.

తిరుమలలో రాజకీయ, ద్వేషపూరిత ప్రసంగాలను నిషేధించాలని ఇటీవల జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో తీర్మానం చేశారు. తాజాగా దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు. తమ నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా రాజకీయ విమర్శలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ స్పష్టం చేసింది. తిరుమలలో శ్రీవారి ఆలయ పవిత్రత, ఆధ్యాత్మికమైన ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ తెలిపింది…