అర్థరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా RTC బస్సులు బంద్‌..!

rtc-strike-alert-ts-buses-halt-midnight-telangana-travel-crisis-

తెలంగాణ ప్రజలు పగటి పూట పనుల మీదూ, పండుగ పూట ఊరెళ్లాలనే ప్రణాళికలలో బిజీగా ఉన్న ఈ సమయంలో… ఒక్కసారిగా ఒక బిగ్ అలర్ట్‌ వచ్చింది. “బస్సులు బంద్!”.. అవును, ఈ అర్థరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా RTC బస్సులు ఆగిపోనున్నాయి. జనజీవనం స్తంభించనున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రైవేటు ట్రావెల్స్‌కి ఇది భలే ఛాన్స్… రెట్లు రేట్లతో డబ్బు దండుకునే సమయం వచ్చేసింది. గతంలో ఎన్నోసారి చూసిన దృశ్యం మళ్లీ రిపీట్ కానుంది. ప్రయాణికుల జేబులు ఖాళీ అయ్యే ప్రమాదం ఖాయం..తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (RTC) కార్మికులు మే 7 నుంచి సమ్మెకు దిగనున్నట్లు RTC జేఏసీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే నిన్న హైదరాబాదులోని బాగ్‌లింగంపల్లిలోని కళాభవన్ నుంచి బస్‌భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వేలాదిమంది ఉద్యోగులు పాల్గొన్న ఈ ర్యాలీలో, తమ సమస్యలను ప్రభుత్వానికి ఎన్నోసార్లు చెప్పినా స్పందన లేకపోవడంతో సమ్మె తుదిపరిష్కారంగా మిగిలిందని జేఏసీ ఛైర్మన్ వెంకన్న గళమెత్తారు. అయితే.. ఈ ర్యాలీకి ముందస్తు అనుమతులు లేకున్నా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బస్‌భవన్ చుట్టుపక్కల భద్రత పెంచడంతోపాటు, ఎవరిని లోపలికి అనుమతించలేదు. సమ్మెకు ఇంకో రోజు మాత్రమే మిగిలి ఉండటంతో, ప్రభుత్వం ఇంకా స్పందించలేదనే పరిస్థితి ప్రజల్లో, ఉద్యోగుల్లో ఉత్కంఠను పెంచుతోంది.