సమాచార హక్కురక్షణ చట్టం హుజూర్నగర్ నియోజకవర్గం నూతన అధ్యక్షులుగా ఖమ్మం సైదులు..
నియామక పత్రాన్ని అందజేసిన సూర్యపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కాంపాటి సందీప్..
సూర్యాపేట జిల్లా, గరిడేపల్లి: ఆగస్టు 31 సమాచార హక్కు రక్షణ చట్టం -2005 హుజూర్నగర్ నియోజకవర్గ అధ్యక్షులుగా హుజూర్నగర్ గ్రామానికి చెందిన ఖమ్మం సైదులును ను ఏకగ్రీవంగా నియోజకవర్గం అధ్యక్షులుగా ఎన్నిక చేయడం జరిగింది. ఎన్నిక అనంతరం నియామక పత్రం అందించడం జరిగింది. ఈ మేరకు సమాచార హక్కు రక్షణ చట్టం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కాంపాటి సందీప్ మాట్లాడుతూ…. సమాచార హక్కు చట్టం గురించి ప్రజల్లో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తూ. అవగాహన సదస్సులు నిర్వహి స్తామని తెలిపారు.. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు రక్షణ చట్టం నియోజకవర్గ పొలిటికల్ కన్వీనర్ ఆరాల సైదులు ఇంక తదితరులు పాల్గొన్నారు..