*తెరుచుకున్న శబరిమల గుడి- అయ్యప్ప దర్శనానికి పోటెత్తిన భక్తులు*
కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్పస్వామి ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. వార్షిక చింగం మాస పూజల కోసం శనివారం సాయంత్రం ఐదు గంటలకు ఆలయ పూజారులు తలుపులు తెరిచారు. ప్రధాన పూజారి అరుణ్ కుమార్ నంబూద్రి తంత్రి కందరరు మహేష్ మోహనరు సమక్షంలో ఆలయ దీపాలను, ఆళి (పవిత్ర అగ్నిగుండం)ను వెలిగించారు. వేలాది మంది అయ్యప్ప భక్తులు భారీ వర్షాన్ని లెక్కచేయకుండా వేడుకను తిలకించారు..