నాగార్జున సాగర్ వద్ద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అధికారుల మధ్య వివాదం జరిగింది. నాగార్జున కుడి కాలువ వద్ద వాటర్ రీడింగ్ నమోదు చేసేందుకు తెలంగాణ అధికారులు వెళ్లారు..తెలంగాణ అధికారులను ఎపి అధికారులు అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. కెఆర్ఎంబి యాజమాన్యానికి తెలంగాణ అధికారులు సమాచారం ఇచ్చారు. ఇరు రాష్ట్రాల అధికారులకు సాగర్ ఎస్ఇ కృష్ణమోహన్ సర్దిచెప్పారు..
కుడి కాలువ పైన ఏర్పాటుచేసిన వాటర్ గేజ్ వద్ద రీడింగ్ తీసుకోకుండా తెలంగాణ ఇరిగేషన్ అధికారులను అడ్డుకుంటున్న ఆంధ్ర ఇరిగేషన్ అధికారులు..
కుడి కాలువకు నీటి విడుదలకు సంబంధించిన లెక్కలు చెప్పమని, రీడింగ్ తీయొద్దని మీరు ఎవరికైనా చెప్పుకోండని బెదిరింపులకు పాల్పడుతున్న ఆంధ్ర ఇరిగేషన్ అధికారులు
ఈ విషయాన్ని తెలంగాణ ఇరిగేషన్ అధికారులకు, కే ఆర్ ఎం బి సమాచార గ్రూపుల తో పాటు అధికారులకు తెలియపరిచిన నాగార్జునసాగర్ డ్యాం నిర్వహణ ఇరిగేషన్ అధికారులు అధికారులు..