ఇరు దేశాల మధ్య సీజ్ ఫైర్ సందర్భంగా దేవుడికి కృతజ్ఞతలు అంటూ సల్మాన్ ఖాన్ పోస్టు ..తీవ్ర ఆగ్రహంతో ఘాటు విమర్శలు చేసిన నెటిజెన్లు…….

భారత్- పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ నేపథ్యంలో ఎక్స్ వేదికగా స్పందించారు. ఇరు దేశాల మధ్య సీజ్ ఫైర్ సందర్భంగా దేవుడికి కృతజ్ఞతలు అంటూ పోస్టు పెట్టారు. దీంతో దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు అలుముకున్నాయి. అటు ఫ్యాన్స్ ఇటు బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. దీంతో సల్లూ భాయ్ ఆ ట్వీట్ ను వెంటనే డిలీట్ చేశారు.

ఆపరేషన్ సిందూర్ ప్రారంభమై చాలా రోజులు అవుతున్నా ఎందుకు స్పందించలేదని.. ఇన్ని రోజులు ఎందుకు సైలెంట్ ఉన్నారని నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ పై స్పందించకుండా ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నారని మండిపడ్డారు. దీంతో సల్మాన్ ఖాన్ వెంటనే ఆ ట్వీట్ డిలీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తెలంగాణ బీజేపీ నేత మాధవీలత.. సల్మాన్ ఖాన్ పై ఘాటు విమర్శలు చేశారు. తీవ్రవాదులు లోపలే(భారత్ లోనే) ఉన్నారని.. ముందు వాళ్లను తరిమేయాలని ట్వీట్ చేశారు. మరికొంత మంది మాత్రం ఆ ట్వీట్ లో సల్మాన్ ఖాన్ తప్పేమీ లేదని అన్నారు. సీజ్ ఫైర్ ఒప్పందానికి దేవుడికి థ్యాంక్స్ చెప్పాడని.. పాకిస్థాన్ సీజ్ ఫైర్ ఉల్లంఘించిన నేపథ్యంలో ఆ ట్వీట్ ను సల్మాన్ ఖాన్ డిలీట్ చేశారని అంటున్నారు..