కొనసాగనున్న సింధూ జలాల ఒప్పందం రద్దు.

కొనసాగనున్న సింధూ జలాల ఒప్పందం రద్దు

సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు నిర్ణయం కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ ఒప్పందంపై కాల్పుల విరమణ సమయంలో ఎటువంటి ముందస్తు లేదా అనంతర షరతులు లేవని స్పష్టం చేశాయి. భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణకు అంగీకారం కుదిరిన నేపథ్యంలో కేంద్రం ఈ వివరణ ఇచ్చింది. కాగా, పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్.. పాక్ను దెబ్బకొట్టేందుకు సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే…