సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. *జనవరి 9 నుంచి 12వ తేదీ మధ్య కాచిగూడ-కాకినాడ టౌన్, కాకినాడ టౌన్ -కాచిగూడ, హైదరాబాద్-కాకినాడ టౌన్, కాకినాడటౌన్- హైదరాబాద్* మధ్య ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లకు బుకింగ్ సదుపాయం జనవరి 2వ తేదీ ఉదయం 8గంటల నుంచి అందుబాటులోకి రానుంది..
సికింద్రాబాద్-విశాఖపట్నం ప్రత్యేక రైళ్లు
1. సికింద్రాబాద్ నుంచి బయలురేదే రైలు నెంబర్ 07097 సికింద్రాబాద్ – విశాఖపట్నం స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలు జనవరి 5 నుంచి జనవరి 12 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సికింద్రాబాద్లో ఆదివారాల్లో సాయంత్రం 4:35 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సోమవారం ఉదయం 5:47 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది..