దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారుల డేటా సెఫ్టీకి సంబంధించి షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఎస్బీఐ బ్యాంకు ఖాతాలపై సైబర్‌దాడి జరిగింది. 3,897 బ్యాంకు ఖాతాలపై సైబర్ ఎటాక్ జరిగినట్లు స్వయంగా ఎస్బీఐ వెల్లడించింది. ఈ ఖాతాదారుల రికార్డులు డార్క్ వెబ్‌లోకి వెళ్లాయని ఈ ఘటనపై సమగ్ర విచారణను ప్రారంభించినట్లు బుధవారం స్టాక్ ఎక్స్ఛేంజ్ దాఖలు చేసిన నివేదికలో బ్యాంక్ వెల్లడించింది. లీక్ అయిన సమాచారంలో ఖాతాదారుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లు, పుట్టిన తేదీలు, పేర్లు, లింగం, ఈమెయిల్ ఐడీలు మరియు నివాస చిరునామాలు, వీటితో పాటు బ్రాంచ్ వివరాలు, కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఫైల్ (CIF) ఐడీలు, లోన్, లీడ్ రికార్డులకు సంబంధించిన డేటా కూడా ఉన్నట్లు పేర్కొంది…డార్క్ వెబ్‌లో ఎస్బీఐ కస్టమర్ల డేటా లీక్ అయిందనే హెచ్చరికలకు సంబంధించి అక్టోబర్ 16న తమ త్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ప్రొవైడర్, డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ, కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) నుంచి ఎస్ బీఐకు ఈ సైబర్ ఎటాక్‌కు సంబంధించిన సమాచారం అందింది. ఈ హెచ్చరికల ఆధారంగా డార్క్ వెబ్‌లో లభ్యమైన సుమారు 3,75,000 రికార్డులను ప్రాథమికంగా పరిశీలించగా అందులో 3,897 మంది కస్టమర్ల వ్యక్తిగత వివరాలు ఉన్నట్లు తేలిందని ఎస్బీఐ అంగీకరించింది.!