సేవాలాల్ జయంతిని అధికారికంగా వెంటనే నిర్వహించాలి RDO కు వినతి పత్రం..

సేవాలాల్ జయంతిని అధికారికంగా వెంటనే నిర్వహించాలి…

హుజుర్నగర్ RDO గారికి సేవాలాల్ జయంతి ని ఫిబ్రవరి 28 కల్లా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని తమ అభ్యర్థనను తెలియజేసిన వివిధ గిరిజన, లంబాడి కుల సంఘాల నాయకులు.

సూర్యాపేట జిల్లా: హుజూర్నగర్ టౌన్.

హుజుర్ నగర్ RDO శ్రీనివాస్ కి గిరిజన బంజారా లంబాడి వివిధ కుల సంఘాల నాయకులు కలిసి అధికారికంగా సేవాలాల్ జయంతి వేడుకలను వెంటనే నిర్వహించాలని గిరిజన సంఘాల నాయకులు అభ్యరించారు.

ఈ సందర్బంగా గిరిజన హక్కుల పోరాట సమితి(GHPS) వ్యవస్థాపక అధ్యక్షులు, న్యాయవాది నగేష్ రాథోడ్*,మాట్లాడుతూ…
ప్రతి సంవత్సరం *సేవాలాల్ జయంతిని ఫిబ్రవరి నెలలో అధికారికంగా నిర్వహిస్తారని ఈ సంవత్సరం ఫిబ్రవరి 15 వరకు ఎలక్షన్ కోడ్ ఉన్నందున అధికారులు సేవాలాల్ జయంతిని నిర్వహించలేకపోయారని, సేవాలాల్ జయంతిని ఇప్పుడు వెంటనే నిర్వహించేలా వివిధ మండలాల MRO ల ద్వారా వివిధ కులసంఘాల నాయకులను ఆహ్వానించి తేది ని వెంటనే ప్రకటించాలని ప్రభుత్వం ప్రతి సంవత్సరం సేవాలాల్ జయంతి నిర్వహించుటకు హుజుర్నగర్ నియోజకవర్గంనకు 4.46 లక్షల రూపాయలను కేటాయిస్తుందని ఈ సంవత్సరం సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించకుండానే నిర్వహించామని, వచ్చిన నిధులను దుర్వినియోగం చేయాలనీ కొంతమంది రాజకీయ నాయకులు కుటిల ప్రయత్నం చేస్తున్నారని కాబట్టి వెంటనే పరమ పవిత్రం గా పూజించే గిరిజన ప్రజల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ జయంతిని నిర్వహించుటకు తేదిని ప్రకటించాలని RDO గారిని అభ్యర్ధించగా వారు ఈ విషయాన్నీ గౌరవ జిల్లా కలెక్టర్, మరియు స్థానిక మంత్రి గారి ద్రుష్టి కి తీసుకెళ్లి తదుపరి సేవాలాల్ జయంతి నిర్వహించుటకు తేదిని ప్రకటిస్తానని హామీని ఇవ్వడం జరిగింది*.

. ఈ కార్యక్రమం లో గిరిజన హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు న్యాయవాది నగేష్ రాథోడ్, LHPS జాతీయ అధికార ప్రతినిధి బానోతు వెంకట్రాం నాయక్, గిరిజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు సేవాలాల్ ఉత్సవ కమిటీ మాజీ కన్వీనర్ బానోతు వెంకటేశ్వర్లు నాయక్, ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా అధ్యక్షుడు మాలవుతూ నాగు నాయక్, గిరిజన హక్కుల పోరాట సమితి పట్టణ అధ్యక్షులు నారాయణ నాయక్, గిరిజన హక్కుల పోరాట సమితి చింతలపాలెం మండల నాయకులు భూక్యా ఉపేందర్ నాయక్, బుక్య నాగు నాయక్* తదితరులు పాల్గొన్నారు..