దేశంలో ఎక్కడా లేని విధంగా శబరిమలలో 18 పరమ పవిత్ర మెట్లు పరశు రాములవారు సన్నిధానం ముందు మరకత ఏకశిలలో ప్రతిష్టించి వున్నారు..
. కేవలం భక్తులను పునీతుల చేయు సదుద్దేశ్యంతో నిర్మించబడినది…
ఈ 18 మెట్లు 18 కొండలకు ప్రతీతి..
18 దేవతలు అందు ఆవాహన చేయబడి యున్నారు.
ఆ 18 కొండలు
శబరిమలై చుట్టూ 18 కొండలు – వాటి పేర్లు
1. కాలైకట్టి,
2. ఇంజిప్పార కోట,
3. పుదుచ్చేరి మల,
4. కరిమల,
5. నీలిమల,
6. శబరిమల,
7. పొన్నంబల మేడు,
8. మైలాడుమ్ మేడు,
9. చిట్రంబల మేడు,
10. తలప్పారైమల
11. నీలిక్కల్మల,
12. దేవర్మల,
13. శ్రీపాదమలై,
14. కాంతిమలై,
15. మాతంగమలై
16. సుందర మలై,
17. గౌండన్ మలై,
18. నాగమలై, యివన్నీ శబరిమల చుట్టూ ఉండే కొండలు.
ఏడేడు పద్నాలుగు లోకాలలో ఉన్న ఆయా లోక వాసులు మహాపురుషులు, సమస్త దేవగణాలు, ఆ 18 కొండలలో, పద్దెనిమిది దేవాలయాలలో, ఆలయ పర్యవేక్షణ దేవతలుగా, పరిరక్షకులుగా, పరివారంగా, అక్కడ కొలువుదీరారు. మూలవిరాట్ మూర్తి అయిన శ్రీ ధర్మశాస్తా దేవునికి నిత్యం ఆరాధనలు ఉత్సవాలు జరిగాయి. పరశురాముడు ప్రతిష్ఠించిన 18 కొండలలో ఉన్న 18 ధర్మశాస్త ఆలయా లను పూర్వం ప్రజలు దర్శించి ధన్యత పొందేవారు. ఈ 18 మహాక్షేత్రాలు మొత్తం అపర వైకుంఠ కైలాసంగా అలనాడు భాసించాయి. ‘ ఈ వైభవం చాలాకాలం కొనసాగింది. క్రమ క్రమంగా భక్తులు శబరిమలై కొండకు మాత్రమే పరిమిత మయ్యారు. మిగతా శిఖరాల మీద ఉన్న స్వామి దేవాలయాలకు వెళ్లటం బాగా కష్టం అవటంతో నెమ్మది నెమ్మదిగా బాగా తగ్గి, చివరకు పూర్తిగా వెళ్ళటం మానివేసారు. శబరిమలై కొండమాత్రం భక్తుల సందడితో దేదీప్యమానంగా వెలిగి పోతున్నది. శబరి గిరీశుని ప్రభ దిగంతాలకు వ్యాపించింది. ఇటువంటి తరుణంలో సప్త ఋషులైన కశ్యపుడు, అత్రి, భరద్వాజ, విశ్వామిత్రుడు, గౌతముడు, వశిష్టులు, జమదగ్నిలు పరశురాముని వినతితో ఈ కొండల మీదికి అరుదెంచారు. శబరి మలై కాకుండా మిగతా 17 పర్వత శిఖరాగ్రాల మీద నున్న ఆయా దేవాలయాలను ఒక్కొక్క దానిని సందర్శించి, ఆయా క్షేత్రాలలో ఆలయాల పరివారంగా, పర్యవేక్షకులుగా, పరిరక్షకులుగా ఉన్న సమస్త లోక దివ్యపురుషులను దేవ గణాలనందరినీ సంప్రదించి, వారి అంగీకారంతో, శబరి మలైలో శబరిగిరీశుని సన్నిధిలో “పదునెనిమిది పవిత్ర సోపానాలు”గా ప్రతిష్టించారు. స్వతహాగా ఆ దేవతలకు ఉన్న అద్వితీయ మైన శక్తి మొత్తం 18 మెట్ల రూపంలో ఉన్నది. ఆ మహా పురుషులు దివ్యశక్తికి ప్రతి రూపాలై స్వామి సన్నిధిలో పూజలందుకుంటున్నాయి. అయ్యప్పభక్తులలో ఇంకా ఏదో మూలన ఉన్న చిరు కల్మషాలను సైతం హరించి భక్తుని పరిశుభ్రపరచి స్వామి సన్నిధికి తీసుకు వెళు తున్నాయి. ఆ మహా దేవతల ప్రతిరూపాలైన పదునెట్టాంబడి మీద పాదం మోపే ప్రతిఒక్క భక్తుడు, పరమ పవిత్రుడై ఉంటే గాని, పాదం మోప కూడదు. అపవిత్రంతో పాదం మోపి అనర్థాలు కొని తెచ్చు కోవద్దు. పవిత్రులై పాదం మోపి పరమాద్భుత శక్తిని
మీ శరీరంలో ప్రవేశపెట్టుకోండి.
ఆ 18 దేవతల పేర్లు ఏవన…..
18 మెట్ల దేవతలు అయ్యప్ప స్వామి దీక్షా దారుల రక్షకులు.
ఈ 18 దేవతలు,
18 దివ్య పవిత్ర సోపానములలో
ఆవాహనము గావింప బడియున్నారు.
శబరిమలలో నిర్వహించు పూజా పునస్కారములలో
ఈ దేవత లకు కూడా మిక్కిలి ప్రాధాన్యము గలదు. ఈదేవతల పేర్లు…
(1) నాగయక్క్షి,
(2) మహిషమర్దిని,
(3) అన్నపూర్ణేశ్వరి,
(4) కాళి,
(5) కృష్ణకాళి,
(6) భైరవి,
(7) కార్తవీర్యుడు,
(8) కృష్ణాపర్ (కరుప్పుస్వామి)
(9) హిడింబుడు
(10) బేతాళుడు,
(11) నాగరాజు
(12) రేణుకా
పరమేశ్వరి
(13) స్వప్న వారాహి,
(14) పాశుపతము, ప్రత్యంకర
(15)భూమీదేవి
(16)అఘోర భైరవుడు.
(17) పాశుపతము
(18) మృత్యుంజయము.