*SIR ఎన్యూమరేషన్ ఫారం ఎలా నింపాలి? (కాలమ్ వారీగా పూర్తి వివరణ).!
—
ఈ ఫారంలో కొన్ని వివరాలు ముందుగానే (Pre-printed) ముద్రించబడి ఉంటాయి. వాటిని మార్చకండి. మీరు ఖాళీగా ఉన్న కాలమ్లను మాత్రమే పూరించాలి.
*భాగం – 1:*
పై భాగంలోని వివరాలు
*1. Elector’s Name, EPIC, Address*
ఇది ముందుగానే ముద్రించబడి ఉంటుంది.
మీ పేరు, ఓటరు ID నంబర్ (EPIC), చిరునామా సరిగా ఉన్నాయో లేదో పరిశీలించండి.
*2. Serial No., Part No., AC/PC Name, State*
ఇవి కూడా ముందుగానే ముద్రించబడి ఉంటాయి.
ఏమీ రాయాల్సిన అవసరం లేదు.
*3. QR Code*
రాయవద్దు.
*4. Old Photo*
ముందుగా ముద్రించిన ఫోటో ఉంటుంది.
*5. Paste Current Photo*
ఇక్కడ మీ తాజా పాస్పోర్ట్ సైజు ఫోటో అంటించాలి. స్పష్టమైన, ఇటీవల తీసిన ఫోటో ఉపయోగించండి.
*భాగం – 2: గత SIR (2002) లో మీవి లేదా మీ బంధువుల వివరాలు:*
ఇది అత్యంత ముఖ్యమైన భాగం.
*పరిస్థితి – 1* (ఎడమ వైపు బాక్స్)
*మీ పేరు 2002 SIR ఓటరు జాబితాలో ఉంటే*
ఎడమవైపు “Details of the Elector in the Electoral Roll of the last SIR” కాలమ్లో:
Elector Name
మీ పేరు
EPIC No.
ఉంటే నమోదు చేయండి
Relative’s Name
తండ్రి / తల్లి / భర్త పేరు
Relationship
Father / Mother / Husband
District
అప్పటి జిల్లా
State
రాష్ట్రం
AC Name
అసెంబ్లీ నియోజకవర్గం పేరు
AC Number
అసెంబ్లీ నంబర్
Part No.
పార్ట్ నంబర్
Sr No.
సీరియల్ నంబర్
*పరిస్థితి – 2* (కుడివైపు బాక్స్)
*మీ పేరు 2002 జాబితాలో లేకపోయినా, తల్లిదండ్రులు లేదా బంధువుల పేరు ఉంటే*
కుడివైపు “Details of the Relative…” కాలమ్ నింపాలి.
Name
మీ బంధువు పేరు (తండ్రి, తల్లి, తాత, నానమ్మ, అమ్మమ్మ పేరు – ఎవరిదైతే వారిది)
EPIC No.
ఉంటే నమోదు చేయండి
Relative’s Name బంధువు పేరు
ఆ వ్యక్తి తండ్రి/భర్త పేరు
*ఇది వ్రాయకపోయినా పర్వాలేదు*
Relationship (ఆ వ్యక్తి మీకు ఏమి అవుతారు)
Father / Mother / Grandfather / Husband మొదలైనవి
District
జిల్లా
State
రాష్ట్రం
AC Name
అసెంబ్లీ పేరు
AC Number
అసెంబ్లీ నంబర్
Part No.
పార్ట్ నంబర్
Sr No.
సీరియల్ నంబర్
*పరిస్థితి – 3*
2002 జాబితాలో మీ పేరు లేదా కుటుంబ సభ్యుల పేరు ఏదీ లేకపోతే
పై రెండు కాలమ్లు ఖాళీగా ఉండవచ్చు.
అయితే BLO సూచన మేరకు అర్హత పత్రాలు జతచేయాలి.
తర్వాత పుట్టిన ధృవపత్రం, విద్యా సర్టిఫికెట్, పాస్పోర్ట్, తల్లిదండ్రుల పత్రాలు మొదలైనవి ఉపయోగపడవచ్చు.
*భాగం – 4:* డిక్లరేషన్
క్రింద ఉన్న మూడు ప్రకటనలు చదవాలి.
వాటి సారాంశం:
(1)
*నేను లేదా నా కుటుంబ సభ్యులు ఇతర దేశ పౌరసత్వం పొందలేదు.*
(2)
*నేను మరో నియోజకవర్గంలో ఓటరుగా నమోదు కాలేదు.*
(3)
*తప్పుడు సమాచారం ఇస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని నాకు తెలుసు.*
*భాగం – 5: సంతకం*
Signature / Left Thumb ఇంప్రెషన్
*పురుషులు*: సంతకం లేదా ఎడమ బొటనవేలు ముద్ర
*మహిళలు*: సంతకం లేదా ఎడమ బొటనవేలు ముద్ర
తేదీ తప్పనిసరిగా వేయాలి.
*ఎవరి ఫారం అయితే సమర్పిస్తున్నారో, ప్రస్తుతం ఆ వ్యక్తి ఊరిలో లభ్యంగా లేకుంటే ఏమి చేయాలి?*
*Any Adult Family Member*
ఓటరు అందుబాటులో లేకపోతే కుటుంబంలోని పెద్ద సభ్యుడు ఆ వ్యక్తి తరఫున ఫారం మీద సంతకం చేయవచ్చు. పక్కనే సంబంధం (Father/Mother/Wife/Son etc.) రాయాలి.
*భాగం – 6:*
*BLO భాగం*
BLO’s Undertaking
BLO’s Signature
ఇవి BLO మాత్రమే పూరించాలి.
*మీరు ఈ భాగంలో ఏమీ రాయకూడదు.*
ఫారం సమర్పించే ముందు చెక్లిస్ట్:
✅ తాజా ఫోటో అంటించారా?
✅ పుట్టిన తేదీ సరిగ్గా రాశారా?
✅ మొబైల్ నంబర్ ఇచ్చారా?
✅ తండ్రి/తల్లి/భార్య/భర్త వివరాలు నింపారా?
✅ 2002 SIR వివరాలు ఉంటే నమోదు చేశారా?
✅ సంతకం చేశారా?
✅ BLO నుండి
*అక్నాలెడ్జ్మెంట్ (రసీదు)* తీసుకున్నారా?.
సంతకం పెట్టిన ఇంకో ఫారం మీకు BLO ఇస్తారు. దానిని జాగ్రత్తగా ఉంచుకోండి.
*ముఖ్య సూచన:*
ఫారం ఇచ్చేసి వెళ్లిపోవద్దు. BLO నుండి అక్నాలెడ్జ్మెంట్ లేదా రసీదు తప్పనిసరిగా తీసుకోండి. అలాగే మీరు సమర్పించిన ఫారం మరియు జత చేసిన పత్రాల ఫోటోకాపీలు మీ వద్ద భద్రంగా ఉంచుకోండి.
*⚠️ ముఖ్య సూచనలు*
🔹 భయపడవద్దు, గందరగోళానికి గురికావద్దు.
🔹 ఎన్యూమరేషన్ ఫారాన్ని పూర్తిగా, స్పష్టంగా నింపండి.
🔹 BLO కి నిర్ణీత సమయంలో అందజేయండి.
🔹 ఫారం సమర్పించిన తర్వాత తప్పనిసరిగా అక్నాలెడ్జ్మెంట్ (రసీదు) తీసుకోండి.
🔹 మీ వద్ద ఉన్న పాత, కొత్త పత్రాలన్నింటినీ భద్రంగా ఉంచుకోండి.
🔹 మీ కుటుంబ సభ్యులు, బంధువులు, పొరుగువారికి కూడా ఈ ప్రక్రియ గురించి తెలియజేయండి.
🔹 సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సందేశాన్ని నమ్మవద్దు. అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించండి.
🔹 తప్పుడు వార్తలు, పుకార్లు, భయాందోళనలు కలిగించే సందేశాలను ఫార్వర్డ్ చేయవద్దు.
🔹 ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన హక్కు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నిర్వర్తించాలి.
*”మీ ఫారం – మీ బాధ్యత.మీ ఓటు – మీ హక్కు.*
సమయానికి ఫారం సమర్పించండి, అక్నాలెడ్జ్మెంట్ తీసుకోండి, ఇతరులకు కూడా సహాయం చేయండి.”