*రేపే ఈ ఏడాదికి తొలి సూర్య గ్రహణం*
*ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం రేపు ఏర్పడనుంది. అయితే భారత కాలమానం ప్రకారం ఇది రాత్రివేళ సంభవిస్తుండటంతో మనదేశంలో కనిపించదని ఖగోళ సైంటిస్టులు చెబుతున్నారు. ఆసియా, ఆఫ్రికా, యూరప్, అట్లాంటిక్, ఉత్తర, దక్షిణ అమెరికాలోని పలు దేశాల్లో సూర్యగ్రహణం కనువిందు చేయనుంది. అక్కడి కాలమానం ప్రకారం మ.2.20 గంటలకు ప్రారంభమై సా.4.17 గంటలకు సంపూర్ణ దశకు చేరుకుంటుంది. సా. 6.13 గంటలకు సూర్య గ్రహణం పూర్తవుతుంది…
అయితే.. భారత కాలమానం ప్రకారం.. శనివారం మధ్యాహ్నం 2:20 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6:16 గంటలకు ముగుస్తుంది. ఇది పాల్గుణ మాసం కృష్ణ పక్ష అమావాస్య రోజున సంభవించే పాక్షిక సూర్యగ్రహణం. గ్రహణం సందర్భంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణకాలంలో చేయాల్సిన పరిహారాలు ఏంటి? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు గ్రహణకాలంలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరమేనా! అని అందరికీ సందేహాలు వస్తుంటాయి. మన దేశంలో కనిపించదు కాబట్టి సూత కాలం అంటూ మనకు ఏమీ ఉండదు. ఎలాంటి జాగ్రత్తలు, పరిహారాలు పాటించాల్సిన అవసరం లేదని జ్యోతిష్య శాస్త్రవేత్తలు చెబుతున్నారు.