ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా (Social media) వాడకం విపరీతంగా పెరిగిపోయింది. కాస్తా టైం దొరికిన వెంటనే యూట్యూబ్, ఇన్స్టాలో వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఇక నిత్యం నెట్టింట అనేక వీడియోలు వైరల్ (Viral) అవుతుంటాయి. ఇందులో ఇటీవల కాలంలో పాములకు (Snakes) సంబంధించిన వీడియోలు నెటిజన్లను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు.
https://www.instagram.com/reel/DJXnibOu1Wt/?igsh=MWR4eG45bTVvaDk4OA==
వీడియోలో మంచు ప్రాంతంలో తెల్లటి పాము కనిపిస్తోంది. ఇది చూసేందుకు మొత్తం శరీరం తెల్లటి ఉన్నితో మెత్తటి పిల్లోలా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలోని ఓ వ్యక్తి కూడా పామును పిల్లోలా పట్టుకుని ఉండటం నెటిజన్ల దృష్టిని మరింతగా ఆకర్శిస్తోంది. ఇక ఈ పామును ఆర్క్టిక్ పాము లేదా వుల్లీ స్నేక్గా (Arctic snake, Woolly snake) పిలుస్తున్నారు. అయితే, ఈ వీడియోను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో (Artificial Intelligence) క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది.