పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ దుమ్మురేపింది. పంజాబ్ పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్ హెచ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోర్ చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (69), ఇషాన్ కిషన్ (55) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. 236 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన పంజాబ్ 202 పరుగులకే పరిమితమైంది. దాంతో 33 రన్స్ తేడాతో హైదరాబాద్ విక్టరీ కొట్టింది.పంజాబ్ బ్యాటర్లలో కూపర్ కాన్లీ వీరోచిత పోరాటం చేశాడు. సెంచరీతో కదం తొక్కాడు. 57 బంతుల్లోనే శతకం బాదాడు. 8 సిక్సర్లు కొట్టాడు. సెంచరీ బాదినా, చివరి వరకు క్రీజులో ఉన్నా.. జట్టుకి ఓటమిని మాత్రం తప్పించలేకపోయాడు. ఈ సీజన్ లో పంజాబ్ కు ఇది హ్యాట్రిక్ పరాజయం. ఇక ఘన విజయంతో హైదరాబాద్ పాయింట్స్ టేబుల్ లో టాప్ లోకి దూసుకెళ్లింది.
ఐపీఎల్ 2026 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ అదరగొడుతోంది. బుధవారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పై విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకువెళ్లింది. ఈ క్రమంలో ప్లేఆఫ్స్కు మరింత చేరువైంది. ఇక పంజాబ్ పై గెలవడం పట్ల సన్రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు…
సన్రైజర్స్ హైదరాబాద్ విజయంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ పాట్ కమిన్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. అనంతరం అతడు మాట్లాడుతూ పంజాబ్ పై విజయం సాధించడం సంతోషాన్ని ఇచ్చిందన్నాడు. ఈ మ్యాచ్కు ముందు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న పంజాబ్ను ఓడించడంతో తమ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయిందన్నాడు. బ్యాటర్లు విజృంభించడంతోనే విజయానికి పునాది పడిందని చెప్పుకొచ్చాడు.
తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్లు చేయడం పై కమిన్స్ మాట్లాడుతూ.. నెమ్మదిగా ఆరంభాలనే అనే మాటే తమ జట్టులో ఉండదన్నారు. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ క్రీజులోకి వచ్చిన వెంటనే తొలి బంతి నుంచే బాదుడు మొదలుపెడతారన్నాడు. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే ఇన్ని పరుగులు చేయాలనే టార్గెట్ ఏమీ పెట్టుకోమన్నాడు. సాధ్యమైనన్నీ ఎక్కువ పరుగులు చేసేందుకే ప్రయత్నం చేస్తామని తెలిపాడు. ఒకవేళ వికెట్లు కోల్పోతే అందుకు అనుగుణంగా సర్దు బాటు చేసుకుంటామని చెప్పుకొచ్చాడు.
ఉప్పల్ స్టేడియం తమకు సొంత స్టేడియం అని, గత రెండేళ్లుగా ఇక్కడ అన్ని మ్యాచ్ల్లో రాణిస్తున్నామన్నాడు. తమ బ్యాటింగ్ శైలికి సరిగ్గా సరిపోతుందన్నాడు. ఇక్కడ రాత్రి వేళ్లలో బాల్ కాస్త ఆగుతూ వస్తుందన్నాడు. ఇది స్లో బౌలర్లు, స్పిన్నర్లకు కలిసి వచ్చే అంశం అని అన్నాడు. ఇక ఇక్కడ మధ్యాహ్నం జరిగే మ్యాచ్ల్లో ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అనే ప్రశ్నపై మాట్లాడుతూ.. సాధారణంగా అతడి పిల్లలు ఇక్కడ లేనప్పుడు ఆ సమయానికి ట్రావిస్ హెడ్ నిద్రపోతూ ఉంటాడు. అందుకేనేమో మధ్యాహ్నం ఆటలలో అంత ఇబ్బంది పడుతున్నామేమో? అని కమిన్స్ నవ్వుతూ అన్నాడు.
Shreyas Iyer : ఓటమికి గల ప్రధాన కారణాలు వెల్లడించిన శ్రేయస్ అయ్యర్.. ఆ ఒక్క తప్పు వల్లే మేం ఓడిపోయాం..
ఇక తాను బౌలింగ్ చేసిన తీరుతో సంతోషంగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. అయితే.. తనకు ఈ అవార్డు ఎలా వచ్చిందో ఇప్పటికి అర్థం కావడం లేదన్నాడు. ఏదీఏమైనప్పటికి కూడా జట్టు విజయంలో భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు. ఈ మ్యాచ్లో సెంచరీ చేసిన కూపర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. అతడు అద్భుతమైన ఆటగాడు అని కితాబు ఇచ్చాడు.
ఇక పాయింట్ల పట్టికలో నంబర్ వన్ స్థానం దక్కడంపై ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఓ చిన్న విరామం దొరికిందని, టాప్ పొజిషన్లో ఉండడాన్ని ఎంజాయ్ చేస్తామన్నాడు. ఇక ఈ సీజన్లో తప్పకుండా తమకు కలిసి వస్తుందన్నాడు.