మరో సారి శ్రీతేజ్ హెల్త్ బులెటిన్‌ను విడుదల..!

తాజాగా మరో సారి శ్రీతేజ్ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు కిమ్స్ డాక్టర్లు.పిల్లాడికి అందుతున్న చికిత్స గురించి అప్డేట్స్ అందించారు. శ్రీతేజ్ ఆరోగ్యం కుదుటపడుతోంది. చిన్నారి క్రమంగా కోలుకుంటున్నాడు. యాంటి బయోటిక్స్ కూడా ఆపేశాం. అంటూ శ్రీతేజ్‌ హెల్త్‌ బులిటెన్‌ను చెప్పుకొచ్చారు కిమ్స్ డాక్టర్లు. కానీ ఇంకా వెంటిలేటర్‌పైనే శ్రీ తేజ్ కు చికిత్స కొనసాగుతోందని మెన్షన్ చేశారు. మరోవైపు శ్రీ తేజ్ త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థిస్తున్నారు. త్వరగా కోలుకుని మునుపటిలా… చలాకీగా మారాలని ఆకాంక్షిస్తూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు..