ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంతంలో చిరుతపులుల సంచారం తరచూ కలకలం రేపుతోంది. తాజాగా పాతాళగంగ మెట్ల మార్గంలో ఉన్న ఆలయ పూజారి ఇంటి ప్రాంగణంలో అర్ధరాత్రి చిరుతపులి సంచరించింది.. దృశ్యాలు ఇంటి బయట అమర్చిన సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డు అయ్యాయి.
వివరాల ప్రకారం, రాత్రి ఆలయ పూజారి ఇంట్లోకి చిరుతపులి చొరబడింది. అర్ధరాత్రి తర్వాత ఈ సంఘటన జరిగింది. ఆ సమయంలో పాతాళగంగ మార్గంలో భక్తులు లేదా స్థానికుల కదలిక తక్కువగా ఉండటంతో చిరుత స్వేచ్ఛగా తిరిగింది. సీసీటీవీ దృశ్యాల్లో చిరుతపులి ఇంటి చుట్టూ ప్రశాంతంగా నడుస్తూ, పరిసరాలను పరిశీలిస్తూ కనిపించింది. ఏదైనా ఆహారం దొరుకుతుందేమో అని ఎదురుచూస్తున్నట్లు ఆ చిరుత కదలిక ఉంది. మరుసటి రోజు ఈ ఫుటేజ్ చూసిన కుటుంబ సభ్యులు షాకయ్యారు..
https://x.com/i/status/2006925147329147172
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇంటి బయట అమర్చిన సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డు అయ్యాయి. నిర్భయంగా ఇంటి ప్రాంగణంలో తిరుగుతున్న చిరుతపులి ఫుటేజ్ బయటకు రావడంతో భక్తులు, స్థానికులు అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అప్రమత్తమై భద్రతా చర్యలు చేపట్టారు. ఆలయ పరిసరాల్లో రాత్రి వేళల్లో జాగ్రత్తలు పాటించాలని, అవసరం లేకుండా బయటకు రావొద్దని సూచించారు..
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959