ఇంటర్ ఎగ్జామ్స్ కు సంబంధించి తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. 2026 ఇంటర్ పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్ల ప్రివ్యూ లింక్ను విద్యార్థుల తల్లిదండ్రుల వాట్సాప్ నెంబర్లకు పంపించనుంది. ఫస్టియర్ విద్యార్థులు.. SSC రోల్ నెంబర్, డేటాఫ్ బర్త్ తో.. సెకండియర్ విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్ హాల్ టికెట్ నెంబర్, డేటాఫ్ బర్త్ తో ప్రివ్యూ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సెకండ్ ఇయర్ హాల్ టికెట్ ప్రివ్యూలో పాస్/ఫెయిల్ వివరాలు, పరీక్ష షెడ్యూల్ కూడా అందుబాటులో ఉంటుంది. వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే వెంటనే కాలేజీ ప్రిన్సిపల్ లేదా DIEOలకు తెలియజేయాలని ఇంటర్ బోర్డు సూచించింది..
హాల్టికెట్లు లేకుండా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని, నిషేధిత వస్తువులు తీసుకురావద్దని విద్యార్థులకు సూచించారు. పరీక్షలు ప్రారంభానికి ముందే కేంద్రాలకు చేరుకోవాలని, ఆలస్యంగా వచ్చిన వారికి అనుమతి ఉండదని పేర్కొన్నారు. అలాగే మాస్ కాపీయింగ్ నివారణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
విద్యార్థులు అధికారిక సమాచారం కోసం తెలంగాణ ఇంటర్ బోర్డు వెబ్సైట్ను మాత్రమే అనుసరించాలని, సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని బోర్డు సూచించింది..
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959