యూట్యూబర్ ‘నా అన్వేషణ’ అన్వేష్‌పై ఉచ్చు బిగుస్తోంది..!

𝗘𝗡𝗤𝗨𝗜𝗥𝗬 𝗢𝗡 𝗔𝗡𝗩𝗘𝗦𝗛.

యూట్యూబర్ అన్వేష్ చేస్తే పోలీసుల దర్యాప్తు..

ఇంస్టాగ్రామ్ కు లేఖ రాసిన పంజాగుట్ట పోలీసులు ..

అన్వేష్ యూజర్ ఐడి వివరాలు కోరుతూ పోలీసులు లేక..

విదేశాల్లో ఉంటూ సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు వీడియోలు పెడుతున్న అన్వేష్ ..

అన్వేష్ పై హిందూ సంఘాల ఆగ్రహం..

హిందూ దేవీదేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో యూట్యూబర్ ‘నా అన్వేషణ’ అన్వేష్‌పై నమోదైన కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్వేష్‌కు సంబంధించిన పూర్తి వివరాలు అందజేయాలంటూ సోషల్ మీడియా దిగ్గజం ఇన్‌స్టాగ్రామ్ యాజమాన్యానికి పోలీసులు అధికారిక లేఖ రాశారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది.
ఇటీవల నటుడు శివాజీ ఆడవారి వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలను విమర్శిస్తూ అన్వేష్ ఓ వీడియో విడుదల చేశారు. అయితే ఆ వీడియోలో సీతమ్మ వారు, ద్రౌపది దేవి వంటి హిందూ ఆరాధ్య దైవాలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై సినీ నటి, బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీనిపై స్పందించిన పోలీసులు అన్వేష్‌పై బీఎన్ఎస్ సెక్షన్లు 352, 79, 299తో పాటు ఐటీ చట్టం సెక్షన్ 67 కింద కేసు నమోదు చేశారు. కోట్లాది మంది ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో అన్వేష్‌ను అన్‌సబ్‌స్క్రైబ్ చేయాలనే డిమాండ్ ట్రెండ్ అవుతోంది.

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959