శ్రీశైలం రిజర్వాయర్‌కు కొనసాగుతున్న భారీ వరద..

శ్రీశైలం రిజర్వాయర్‌కు కొనసాగుతున్న భారీ వరద
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయానికి 2,20,948 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా, ఔట్‌ఫ్లో మాత్రం నిల్‌గా ఉంది.
జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 869.20 అడుగుల వద్ద నీటిమట్టం నమోదైంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.