సూర్యాపేటలో భార్యను హత్య చేసిన భర్త..

*సూర్యాపేట జిల్లా..*

సూర్యాపేటలో భార్యను హత్య చేసిన భర్త..

పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ మొదటి విడతలో దారుణ ఘటన

జమ్ముల శ్రీను (టైల్స్ వర్కర్) తన భార్య జమ్ముల పుష్పలతపై అనుమానమే కారణంంటున్న స్థానికులు..

కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యాభర్తల మధ్య గొడవ.. కోపంతో భార్యపై దాడి చేసి హత్య

సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు

మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు..

కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో మద్యం మత్తులో ఉన్న శ్రీను, గొడవకు దిగాడు. కర్రతో భార్య తలపై కొట్టి అక్కడికక్కడే హత్య చేశాడు. అనంతరం ఆదివారం ఉదయం నిందితుడు పోలీసుల వద్ద లొంగిపోయాడు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు..