International Womens Day ..ప్రతి ఏడాది మార్చి 8నే మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు?..

మార్చి 8 అనేది ఒక క్యాలెండర్ లో ఒక తేదీ మాత్రమే కాదు, ఒక మార్పుకు చిహ్నం. ఈ రోజు తేవడం కోసం ఎన్నో ఉద్యమాలు, రాజకీయ పోరాటాలు చాలానే ఉన్నాయి..ఇక 1910 కోపెన్‌హాగన్‌లో నిర్వహించిన ఒక మీటింగ్ లో క్లారా జెట్కిన్ అనే మహిళ ఇంటెర్నేషనల్ డే గురించి ప్రస్తావన వచ్చింది. అయితే, అప్పుడు 17 దేశాల మహిళలు ఏకగ్రీవంగా ఈ ప్రతిపాదికను అంగీకరించారు..1917 మొదటి ప్రపంచ యుద్ధ టైమ్ లో, రష్యాలో ఉన్న కొందరు మహిళలు “బ్రెడ్ అండ్ పీస్” కోసం ఎన్నో ధర్నాలు చేశారు. అయితే, ఇది మార్చి 8న మొదలైంది..ఐక్యరాజ్యసమితి 1975 లో ఈ మహిళా దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది. ఇక ఆ రోజు నుంచి ప్రపంచ దేశాలన్ని ప్రభుత్వ సెలవు దినంగా అంగీకరించి ఉత్తర్వులు జారీ చేశారు. అలా ప్రతి ఏడాది మార్చి 8న అంతర్జాతీయ మహిళల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ రోజు మహిళల గొప్పతనం గురించి తెలియజేస్తుంది…

అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2026 థీమ్..
అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి ఏడాది ఒక్కో థీమ్‌తో జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది 2026 కు సంబంధించి మహిళా సాధికారత, సమానత్వం, నాయకత్వం వంటి అంశాలపై దృష్టి సారించే విధంగా థీమ్‌ రెడీ చేశారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు సమాజంలో మార్పు తీసుకురావడానికి రూపొందించారు. ఈసారి ప్రత్యేక థీమ్‌ ‘Give To Gain’.. అంటే ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం తద్వారా ప్రయోజనం పొందడం. .