విజ్ఞాన భాండాగారాలైన గ్రంధాలయాలను ప్రారంభించండి నిరుద్యోగ యువత ఇబ్బందులు తొలగించండి.మంత్రి ఉత్తమ్ కు విజ్ఞప్తి…రాపోలు నవీన్ కుమార్.

*విజ్ఞాన భాండాగారాలైన గ్రంధాలయాలను ప్రారంభించండి నిరుద్యోగ యువత ఇబ్బందులు తొలగించండి.మంత్రి ఉత్తమ్ కు విజ్ఞప్తి…రాపోలు నవీన్ కుమార్

విజ్ఞాన భాండారాలైన, ఆధునిక దేవాలయాలు గా ప్రసిద్ధిగాంచిన గ్రంథాలయాల నిర్మాణం పూర్తయి చాన్నాళ్లు అయినందున హుజూర్ నగర్ మరియు నేరేడుచర్లలో తక్షణమే మంత్రి ఉత్తమ్ వాటిని ప్రారంభించి నిరుద్యోగ యువతకు అందుబాటులోకి తేవాలని బి ఆర్ ఎస్ నియోజకవర్గ నాయకులు రాపోలు నవీన్ కుమార్ కోరారు గురువారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల లో నూతనంగా నిర్మించిన గ్రంథాలయ ముందు బిఆర్ యస్ మరియు నిరుద్యోగ యువతతో కలిసి పాత్రికేయులతో మాట్లాడుతూ గ్రంథాలయాలు కేవలం పుస్తకాలు ఉండే గదులు కావు అని అవి జ్ఞానానికి నిలయాలు, యువత భవిష్యత్తుకు బాటలు వేసే కేంద్రాలు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఖరీదైన పుస్తకాలు, కోచింగ్ సౌకర్యాలు అందుబాటులో లేకపోయినా, గ్రంథాలయాలు వారికి ఎంతో ఉపయోగపడతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువతకు పుస్తకాలు, పత్రికలు, ప్రశాంతమైన చదువు వాతావరణం అవసరం అలాంటి జ్ఞాన భాండాగారాలు మూసి ఉంటే నష్టపోయేది ఒక భవనం కాదు చదువుకునే అవకాశం, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువత సమయం, వారి భవిష్యత్తు అని వెనువెంటనే వాటిని ప్రారంభించాలి అని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమం లో బిఆర్ యస్ నాయకులు తకెళ్ళ నాగార్జున షేక్ నాగుల్ మీరా పత్తిపాక రమేష్ గౌతమ్ వాస విజయ్ బోస్ తదితరులు పాల్గొన్నారు