*సూర్యాపేట జిల్లా..*
సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి..
*జగదీష్ రెడ్డి మాట్లాడుతూ. ..*
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైంది..
రేవంత్ కు పాలన చేతకాకనే కాలం వెళ్ళబుచ్చుతుండు..
రెండేళ్లు కావస్తున్నా రేవంత్ బూతుపురాణాలు మానడం లేదు..
ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్టే మాట్లాడుతున్నడు..
ప్రజలకు ఇచ్చిన హామీలను మరిపించేందుకు కొత్త నాటకాలు..
ఒక్క రంగంలో కూడా అడుగు ముందుకేసిన దాఖలాలు లేవు..
గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాలను కూడా కుంటుపట్టిస్తున్నారు..
కొత్త ఇండ్లు కట్టిస్తామని చెప్పి.. ఉన్న ఇల్లు కూలగొట్టే పని చేపట్టిండ్రు..
కొత్త ప్రాజెక్టుల మాట దేవుడెరుగు.. వున్న ప్రాజెక్టులను బందుపెట్టి పొలాలను ఎండబెడుతున్నారు..
కాంగ్రెస్ బిజెపి సహకారంతోనే కెసిఆర్ పై కుట్రలు చేస్తోంది .
బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలకు ఇద్దరికి కెసిఆరే ప్రధాన శత్రువు..
దీంతో రేపటి తెలంగాణ కెసిఆర్ దే అని వాళ్లకు అర్థమైందని తెలుస్తుంది..
మళ్ళీ ప్రజా సంక్షేమ పార్టీ BRS రాబోతుందని వాళ్లకు అర్థమైంది..
అందుకే కక్కలేక మింగలేని స్థితిలో రేవంత్ పాలన సాగుతుంది..
రేవంత్, బండి సంజయ్ ల రాజకీయ చరిత్ర అందరికీ తెలుసు..
స్ట్రీట్ ఫెలోస్ స్టేట్ లీడర్ అయిండు.. గల్లి నాయకుడు ఏకగ్రీవంగా ఢిల్లీ ప్రమోషన్ రావడంతోనే ప్రజలకు కష్టాలు వచ్చినయి..
కనీసం ట్రాఫిక్ నియాంట్రించే సత్తువకూడా కాంగ్రేస్ కు లేదు..
నీళ్లలో వాటర్ కలవడం వల్లనే శ్రీశైలం మార్గం కుంగి పోయిందని ఒకరు..
డ్రైన్ వాటర్ లో రైన్ వాటర్ కలవడం వల్లనే వరదలోచ్చినాయన్న అజ్ఞాన మంత్రులతో ఏం అభివృద్ధి సాధిస్తారు..
దీంతో కొత్తదనం పిల్లలకు వాళ్ళ మాటలు అర్థం కాక చాలా ఇబ్బందులు పడుతున్నారు..
సమస్యల పైన అవగాహనా లేదు.. అభివృద్ధి చేసే దమ్ము లేకనే అర్ధం లేని మాటలు..
వాస్తవానికి బీజేపీ, కాంగ్రేస్ జాతీయ పార్టీలుగా ఒకరినొకరు విమర్శించుకోవాలి..
కానీ ఇద్దరూ కలిసి కెసిఆర్ మీద ఏడుస్తున్నప్పుడే ప్రజలకు అర్థమైంది..
వాళ్లెంత దిగజారి మాట్లాడినా.. మేము ప్రజలకు అర్థమయ్యే భాషలోనే మాట్లాడతాం..
చిల్లర చేరికలతో బిజెపి స్థాయి ఏందో తెలుస్తోంది..
ఎవరో మాజీ ఎమ్మెల్యేను పట్టుకుని బీజేపీ ఏదో ఊహించికుంటే అయిపోతుందా..
దీంతో పార్టీ పెరుగుతది.. ఓట్లు వస్తాయి అనుకుంటే మీ భ్రమే..
2024 పార్లమెంట్ ఎన్నికల తోనే మోడీ ఓటమి మొదలైందని అర్థమైంది..
ప్రజల ఆకలి.. మీరు ఇచ్చిన హామీల ముందు మీ మోసాలు నిలబడవు…
రేవంత్, బండి ప్రమాణాలు ప్రజలందరికి తెలుసు..
దేవుళ్ళ మీద విశ్వాసం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే.. అది రేవంత్, బండిలే..
ప్రతీ విషయాన్నీ దేవుళ్ళ మీద పెట్టేవాడు భక్తుడైతడా..
నిజంగా ట్యాపింగ్ చేయించింది కేటీఆర్ అని బండి సంజయ్ నువ్వు ప్రమాణం చేస్తావా..
ఏదైనా మాట్లాడితే బాధ్యతాయుతంగా ఉండాలి..
చిల్లర మాటలు, ఈ బూతు మాటలతోటి ప్రజల కడుపులు నిండవు..
ఇలాంటి మాటలు రాజకీయాలకు కూడా పనికొచ్చేవి కావు..