రేవంత్ రెడ్డి సింగరేణిలో వస్తున్న మంచి బొగ్గును ఏపీలో తన గురువు చంద్రబాబుకి, కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పంపిస్తున్నాడు … మాజీ మంత్రి జగదీష్ రెడ్డి..

రేవంత్ రెడ్డి సింగరేణిలో వస్తున్న మంచి బొగ్గును ఏపీలో తన గురువు చంద్రబాబుకి, కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పంపిస్తున్నాడు

దీని వల్లే ఇబ్బంది అయింది తప్ప వేరే ఎలాంటి కారణం లేదు

ఈ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి కారణం ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రులే

పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నాము.. లేకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టము..- మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి

బొగ్గు విషయంలో ఎందుకు సమస్య వచ్చిందంటే.. రేవంత్‌ రెడ్డి సింగరేణిలో వస్తున్న మంచి బొగ్గును ఒకవైపు ఆంధ్రప్రదేశ్‌లో తన గురువుకు పంపిస్తున్నడు. ఇంకోవైపు కర్ణాటకలో వాళ్ల పార్టీ ప్రభుత్వముంది. అక్కడికి పంపిస్తున్నడు.. తెలంగాణ ప్రజలను దారుణంగా శిక్షిస్తున్నడని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. జగదీష్ రెడ్డి, ఇతర బీఆర్ఎస్ నాయకుల బృందం గురువారం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ సందర్శనకు వెళ్లింది.. జగదీష్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లా ….
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కామెంట్స్.

తెలంగాణలో మళ్లీ విద్యుత్ సమస్య తీవ్రమవుతోంది..

రైతాంగానికి 2014 పూర్వపు కరెంట్ కష్టాలు పునరావృతమవుతున్నాయి..

ఇళ్లకు పవర్ కట్స్,పరిశ్రమలకు జనరేటర్లు వాడే పరిస్థితి వచ్చింది
కరెంట్ లేక చివరకు రైతులు కూడా డిజెల్ జనరేటర్లు వాడాల్సి వస్తోంది..

కేసీఆర్,కేటీఆర్ పిలుపు మేరకు విద్యుత్ ప్లాంట్ల సందర్శన
మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామరచర్ల పవర్ ప్లాంట్‌ను పరిశీలించాం..

దామరచర్ల 4000 మెగావాట్ల ప్లాంట్ దేశంలోనే అతిపెద్దది
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ బీఆర్ఎస్ ప్రభుత్వ ఘనత..

తెలంగాణ వచ్చేనాటికి రాష్ట్రంలో 6,700 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి మాత్రమే ఉండేది..

బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ ఉత్పత్తిని 21,500 మెగావాట్లకు పెంచాం..

అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇచ్చే సామర్థ్యం రాష్ట్రానికి ఉంది
ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం, దురుద్దేశంతో విద్యుత్ ఉత్పత్తిని ఆపేసింది..

విద్యుత్ కోతలపై ప్రభుత్వం చెబుతున్న కారణాలన్నీ పచ్చి అబద్ధాలు..బొగ్గును ఆంద్రకు కర్ణాటక కు అమ్ముకుంటున్నాడు రేవంత్ రెడ్డి…40 లక్షల టన్నుల బొగ్గు స్కామ్ జరిగింది…. ఇక్కడి రైతులకు మాత్రం 6 గంటలు కూడా ఇవ్వడం లేదు.. రేవంత్ రెడ్డి బండారం బయటపడింది…. ఈ ప్రభుత్వం లో అడుగడుగునా అక్రమాలు, స్కామ్ లే…..ఎక్కడ చూసినా నిరసనలే కనిపిస్తున్నాయి… అన్ని వర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నారు… ప్లాంట్ లోపల అధికారులు నోత్తి నోరు కొట్టుకున్నారు… ప్రభుత్వం కావాలని ప్లాంట్ మొత్తాన్ని నాశనం చేస్తున్నారు అని వాపోతున్నారు… ప్లాంట్ మొత్తాన్ని ఫెయిల్యూర్ చేసే పెద్ద కుట్ర చేస్తున్నారు…..బొగ్గు కొరత లేనే లేదు… మన బొగ్గును ఇతర రాష్ట్రాల కు ఆముకుంటున్నారు…40 లక్షల టన్నుల బొగ్గును మాయం చేశారు…. అన్ని కక్కిస్తాం…అన్నిటినీ వెలికితీస్తాం.. రేవంత్ రెడ్డి ఇడిచిపెట్టేది లేదు….రేవంత్ రెడ్డి చేస్తున్న స్కామ్ లు అన్ని ఒక్కొక్కటిగా బయటకి తిస్తాం… జగదీష్ రెడ్డి… సింగరేణిలో తయారైన బ్రహ్మాండంగా తయారైన మంచి బొగ్గు గురించి అధికారులకు చూపించిన లెక్కలున్నాయి. రేవంత్‌ రెడ్డి వాటిని ఏపీకి పంపుతున్నడు.. కర్ణాటకకు పంపుతున్నడు. తెలంగాణకు మాత్రం ఎడమ చేయి చూపించి నాశనం చేసిండు. దీనివల్లనే ఇబ్బంది అయింది తప్ప వేరే ఏమీ లేదని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.. విద్యుత్‌ రాకపోవడానికి కారణం రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యం.. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గం. దాంట్లో భాగంగా స్థానికంగా కూడా ఒక సమస్య ఉంది. ఈ ప్లాంటు కట్టేటప్పుడు స్థానికంగా ఉండేవాళ్లకు మాత్రమే ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయం చేశామన్నారు.

ఈ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి కారణం ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రులే తప్ప అధికారులు కాదు.. సిబ్బంది కాదు.. బొగ్గు లేక కాదు.. నీళ్లు లేక కాదు.. అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని ఉందన్నట్టు.. రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అనే శని మాత్రమే తెలంగాణను పట్టి నాశనం చేసి నీళ్లు లేకుండా చేస్తుంది.. కరెంట్‌ లేకుండా తెలంగాణను చీకట్లోకి నెడుతుందని మండిపడ్డారు. పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నాము.. లేకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని జగదీష్ రెడ్డి అన్నారు…