హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు… పలుచోట్ల రోడ్లపై నుండి ప్రవహిస్తున్న వరద నీరు రాకపోకలకు ఇబ్బంది…!

సూర్యాపేట జిల్లా… హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా భారీగా కురుస్తున్న వర్షం.. పొంగిపొర్లుతున్న వాగులు వంకలు.. పాలు గ్రామాల్లో రాకపోకలకు అంతరాయం వాటిల్లింది..

బుధవారం రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి..

మఠంపల్లి మండలం రఘునాథపాలెం గ్రామంలో ఓ పెద్ద చెట్టు కూలి విద్యుత్ కి అంతరాయం ఏర్పడింది…. రాత్రి కూలిపోవడంతో తప్పిన పెను ప్రమాదం..

చింతలపాలెం మండలంలో
చింతలపాలెం మండలం వజినేపల్లి కర్త వాగు ఉద్ధృతి..

పులిచింతల–జగ్గయ్యపేట మార్గంలోని వజినేపల్లి కర్త వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద నీరు రోడ్డుపైకి చేరడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు..

చింతలపాలెం,, మెల్లచెరువు మండలం మధ్య 20 కోట్ల అంచనా తో ఇటీవల మల్లారెడ్డిగూడెం రేవూరు రామాపురం వరకు డబల్ రోడ్డు పది కిలోమీటర్ల మేరకు ఆధునీకరణ, రోడ్డు వెడల్పు, కాంట్రాక్టర్ అలసత్వంతో నీట మునిగిన పంట పొలాలు…

పొలాలు నీటి మునగడంతో.. R&B అధికారులకు సమాచారం అందించడంతో జెసిబి సహాయంతో రోడ్డుని తవ్వించి వరద నీటిని బయటికి పంపించిన అధికారులు…
ఈ సందర్భంగా రైతులు కాంట్రాక్టర్ పై అగ్రహారం వ్యక్తం చేశారు.. తేలికపాటి వరదకే తమ పొలాలు నీట మునిగితే రేపు రానున్న రోజుల్లో భారీ వర్షాలు వస్తే తమ పరిస్థితి ఏమిటో అని ప్రశ్నించారు.. నిత్యం వరద నీరు పారే ఏరియాలలో పెద్ద గోనాలు వేస్తూ రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని అన్నారు…కాంట్రాక్టర్ కకృతి వల్లే ఇలా జరిగిందంటూ రైతులు ఆరోపిస్తున్నారు…

*తాత్కాలిక వంతెన కొట్టుకుపోయి రాకపోకలు బంద్*

*తాళ్ల మల్కాపురం–కీతవారిగూడెం మధ్య నిలిచిన రాకపోకలు*

గరిడేపల్లి మండలం తాళ్ల మల్కాపురం గ్రామంలో నిర్మాణంలో ఉన్న వంతెన సమీపంలో నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వంతెన కొట్టుకుపోయింది. దీంతో తాళ్ల మల్కాపురం–కీతవారిగూడెం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వంతెన దెబ్బతినడంతో స్థానికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. .

అప్రమత్తంగా ఉండాలని తెలిపిన అధికారులు..

ప్రస్తుతం బుధవారం రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలకి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కరెంటు పోల్స్ కి దూరంగా ఉండాలని తెలిపారు..