దొరికిన డబ్బు బాదితునికి అందజేసిన పోలీస్..స్పెషల్ పార్టీ హెడ్ కానిస్టేబుల్….

*దొరికిన నగదు రూ.1.50 లక్షలు బాధితునికి అందజేసిన స్పెషల్ పార్టీ హెడ్ కానిస్టేబుల్ లింగయ్య..

సూర్యాపేట పట్టణంలో ఈరోజు బంగారం షాపు ఓపెనింగ్ సందర్భంగా ప్రజలు ఎక్కువగా వస్తారనే ఉద్దేశ్యంతో స్పెషల్ పార్టీ సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా అక్కడకి వచ్చిన ఒక వ్యక్తి నగదు రూ.1,50,000/- పోగొట్టుకోగా అవి అక్కడ విధుల్లో ఉన్న సూర్యాపేట జిల్లా స్పెషల్ పార్టీ అర్ముడ్ హెడ్ కానిస్టేబుల్ లింగయ్య కు దొరికినవి.. దొరికిన నగదును సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది సాయంతో బాధితునికి అందజేయడం జరిగినది. బాధితుడు మోతే మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తించడం జరిగినది. నిజాయితీ చాటుకున్న హెడ్ కానిస్టేబుల్ లింగయ్య ను పోలీసు అధికారులు, పౌరులు అభినందించారు..