ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య కీలక నిర్ణయం..
* రేపటి నుంచి పరీక్షలను బహిష్కరిస్తున్నాం..
* ఈ నెల 8న హైదరాబాద్లో కాలేజీల సిబ్బందితో సమావేశం..
* 11న 10 లక్షల మంది విద్యార్థులతో సభ..
* మా డిమాండ్స్ను నెరవేర్చేవరకు బంద్ జరుగుతుంది….
* ప్రైవేట్ విద్యా సంస్థల సమాఖ్య.
రాష్ట్రంలోని ప్రైవేటు వృత్తి విద్యా కళాశాలలు సోమవారం నుంచి బంద్ పాటించనున్నట్టుగా తెలిపాయి. ఈ మేరకు ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య నిరవధిక బంద్కు పిలుపునిచ్చింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో బంద్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపాయి. ఈ మేరకు నేటి నుంచి దశల వారీగా ఉద్యమాలు చేపట్టాలని ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య నిర్ణయించింది.
ప్రైవేట్ కళాశాలలకు హామీ: 2024- 25 విద్యా సంవత్సరానికి గాను ప్రైవేట్ కళాశాలలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.9 వేల కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ మేరకు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ ఏడాది సెప్టెంబర్లో విద్యాసంస్థలు నిరసనలు చేపట్టాయి. అయితే ఈ మొత్తంలో రూ. 1200 కోట్లు రెండు విడతల్లో ఇస్తామని దసరా సందర్భంగా ప్రభుత్వం ప్రకటించింది. ఇక మిగతా రూ. 7,200 కోట్లను కూడా మార్చి 2026 నాటికి చెల్లించేలా ప్రభుత్వం ప్రైవేట్ కళాశాలలకు హామీ ఇచ్చింది