గర్భిణీ అని చూడకుండా కడుపుపై కొట్టిన మహిళా పోలీసు అధికారి..
మొయినాబాద్ – పెద్దమంగళారం లంబాడాల ఇండ్ల కూల్చివేతల ఘటనలో మహిళ ఆవేదన..
పెద్దమంగళారం గ్రామ రెవెన్యూలో సర్వే నంబర్ 210, 211, 212లలో లంబాడాలు ప్లాట్లు కొని కట్టుకున్న ఇళ్లను వారం రోజుల కిందట కూల్చేసిన అధికారులు..
ఉదయం 6 గంటలకు పోలీసులు, అధికారులు ఇంట్లోకి వచ్చి మా ఫోన్లు లాక్కొని, మమ్మల్ని బయటకు గుంజేశారు..
నేను 5 నెలల గర్భిణీని అని చెప్పినా కూడా కడుపు మీద మహిళా పోలీసు అధికారి కొట్టింది..
మేము కష్టపడి సంపాదించి కట్టుకున్న ఇల్లు అంటూ పోలీసుల కాళ్లు మొక్కినా కూడా కనికరించకుండా మా సామాన్లు బయట పడేశారు…
7 రోజుల నుండి ఇదే చలిలో పడుకుంటున్నాం, బయటే వండుకొని తింటున్నాం..
కష్టపడి కట్టుకున్న ఇప్పుడు వీళ్లు వచ్చి ఇల్లు కూలగొట్టారు, మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు.. మాకు న్యాయం కావాలంటూ బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు…
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959