సన్ రైజ్ కోచింగ్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే బాలు నాయక్.

సన్ రైజ్ కోచింగ్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే బాలు నాయక్.

అన్ని పోటీ ప్రవేశ పరీక్షలకు ఉత్తమమైన కోచింగ్ సెంటర్.

ఉత్తమ విద్య- ఉజ్వల భవిష్యత్తు సన్ రైజ్ తోనే సాధ్యం .

దేవరకొండ…….
విద్యార్థులు తమ లక్ష్యాన్ని సాధించే వరకు సన్ రైజ్ కోచింగ్‌ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ తెలిపారు. మంగళవారం పట్టణంలోని డిండి రోడ్డులోని పాత కవిత బి-ఎడ్ కాలేజ్ భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన సన్ రైజ్ కోచింగ్ సెంటర్ ను వారు ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవరకొండ ప్రాంతంలోని విద్యార్థులకు ఇంత మంచి సౌకర్యం కలిగిస్తున్న కోచింగ్ సెంటర్ యాజమాన్యానికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలిపారు. ఈ యొక్క కోచింగ్ సెంటర్లో నవోదయ విద్యాలయం,
స్టేట్ సైనిక్ స్కూల్,ఆల్ ఇండియా సైనిక్ స్కూల్, .రాష్ట్రీయ మిలిటరీ స్కూల్,గురుకుల పాఠశాల, ఏకలవ్య పాఠశాల
వంటి పోటీ పరీక్షలకు రెసిడెన్షియల్ / సెమీ రెసిడెన్షియల్ / డే స్కాలర్ సౌకర్యాలతో, నవోదయ పూర్వ విద్యార్థులచే నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క అవకాశాన్ని దేవరకొండ ప్రాంత ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలు అందరూ వినియోగించుకోవాలని కోరారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి నిపుణులైన ఫ్యాకల్టీ చే సబ్జెక్టులపై పట్టు సాధించడానికి, అనుభవజ్ఞుల మార్గదర్శకత్వంలో, క్రమశిక్షణతో సన్ రైజ్ కోచింగ్ సెంటర్ ను ఉపయోగించుకోవాలని కోచింగ్ సెంటర్ యాజమాన్యం కేతావత్ మంజు నాయక్,కేతావత్ జైపాల్ సింగ్, కేతావత్ గౌతమి తెలిపారు.
ఈ కార్యక్రమంలో నేరేడుగొమ్ము మండల అధ్యక్షుడు లోకసాని కృష్ణయ్య, మాజీ జెడ్పిటిసి నేనావత్ బాలు, మాజీ ఎంపిటిసి గడ్డం వెంకటయ్య మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు..