సుప్రీం కోర్టులో చంద్రబాబు కేసు విచారణ మరో బెంచికి బదిలీ…
సుప్రీమ్ కోర్టులో చంద్రబాబు కేసు అక్టోబర్ 3కి వాయిదా..
సుప్రీం కోర్టులో జరుగుతున్న చంద్రబాబు కేసు విచారణ మరో బెంచికి బదిలీ..
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ డిస్మిస్ కావడంతో ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరిన సంగతి తెలిసిందే…
టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణ అక్టోబర్ 3కు వాయిదా పడింది. సుప్రీంకోర్టులో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్‌ను విచారిస్తున్న ధర్మాసనం దీనిని మరో బెంచ్ వద్దకు బదిలీ చేసింది. ధర్మాసనం లోని జడ్జి ఎస్వీ భట్టి ఈ కేసు విచారణకు విముఖత చూపారు. చంద్రబాబు పిటిషన్ పై నాట్ భిపోర్ మిఅని స్పందించారు. అయితే దీనిపై చంద్రబాబు లాయర్లు చీఫ్ జస్టిస్ ను రిక్వెస్ట్ చేయడం, ఆయన అంగీకరించడంతో వాదనలు ప్రారంభమయ్యాయి..
చంద్రబాబు కేసు విచారణకు విముఖత చూపిన జస్టిస్ ఎస్వీ భట్టి..
రేపటి నుండి సుప్రీమ్ కోర్టుకు సెలవులు కావడంతో వచ్చే వారం విచారణ చేపట్టనున్న సుప్రీమ్ కోర్టు…
ఎస్వీ భట్టి 2013 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా పనిచేసారు. జూలై 14 నుంచి సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన కేసు కాబట్టి ఈ కేసు నుంచి దూరంగా ఉంటున్నానని ఆయన ప్రకటించారు. జస్టిస్ భట్టి నిర్ణయాన్ని గౌరవించాలని మరో జడ్జి ఖన్నా అన్నారు. దీనితో కేసు మరో బెంచ్ కు బదిలీ అయింది. అయితే చంద్రబాబు తరపున హరీష్ సాల్వే, సిద్దార్ద లూద్రా చీఫ్ జస్టిస్ ను రిక్వెస్ట్ చేయడం, ఆయన అంగీకరించడంతో వాదనలు ప్రారంభమయ్యాయి. చంద్రబాబుకు మధ్యంతర ఉపశమనం కలిగించాలనేది తాము కోరుతున్నామని చంద్రబాబు లాయర్లు తెలిపారు. అనంతరం చీఫ్ జస్టిస్ ఈ కేసు విచారణ మంగళవారానికి వాయిదా వేసారు..