రాజ్ కుమార్ సోదరి పోలీసులకు తెలిపిన వివరాలు ఇవే. !.. భార్యా పిల్లల్ని చంపడానికి అసలు కారణం ఇదే..!?
రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఆరుగురిని చంపిన నిందితుడు రాజ్‌కుమార్ ఉన్మాదానికి వెనుక భయంకరమైన అప్పుల కూపం, విడాకుల వివాదమే ప్రధాన కారణాలని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో తనకంటే ఆరేళ్లు పెద్దదైన, తనకు పాఠాలు నేర్పిన ట్యూషన్ టీచర్ సరితను ప్రేమ పేరిట వేధించి 2018లో బలవంతంగా పెళ్లాడిన రాజ్‌కుమార్.. ఆ తర్వాత జూదం, ఆన్లైన్ బెట్టింగ్‌లకు బానిసయ్యాడు. కొడుకు ఆత్మహత్య డ్రామాలకు భయపడి తల్లిదండ్రులు తమ ఆస్తులన్నీ అమ్మేసినప్పటికీ.. డ్రగ్స్ మైకంలో మునిగిపోయిన అతడు ఏకంగా రూ. 2 కోట్ల వరకు అప్పులు చేశాడు.. రాజ్ కుమార్ సోదరి పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. రాజ్ కుమార్ భార్య సరిత (33) తనకంటే వయసులో ఆరేళ్లు పెద్దది. వీరిద్దరిదీ ప్రేమ వివాహం. అయితే.. రాజ్ కుమార్ ఇంటర్మీడియట్ చదివే సమయంలో తనకు ట్యూషన్ చెప్పిన టీచరే ఈ సరిత అని పోలీసుల తాజా విచారణలో తెలిసిందని సమాచారం. ఆమెను ప్రేమ పేరుతో వేధించిన రాజ్ కుమార్.. ఆమెకు ఇంట్లో చూసిన పెళ్లి సంబంధాలను చెడగొట్టి మరీ.. 2018లో పెళ్లి చేసుకున్నాడు.
డ్రైవింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న అతను.. బెట్టింగులు, జూదం వంటి వ్యసనాలకు తీవ్రంగా అలవాటుపడి.. పెద్దమొత్తంలో అప్పు చేసి, ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అప్పులు కట్టలేకపోతున్నానని, తాను చనిపోతానని రాజ్ కుమార్ తల్లిదండ్రులకు మొరపెట్టుకోగా.. తమకు ఉన్న కొంత పొలాన్ని అమ్మేసి అప్పులు తీర్చారు. ఆ తర్వాతైనా అతనిలో మార్పు రాకపోగా.. మరింత జల్సాలకు, మద్యానికి బానిసయ్యాడు. తరచూ మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యను వేధించేవాడని, దాదాపు రూ.2 కోట్లు అప్పులు చేశాడని రాజ్ కుమార్ సోదరి పోలీసులకు తెలిపింది. అతని వేధింపులు భరించలేక తనకు విడాకులు ఇవ్వాలని అడిగిందని, అందుకే ఆమెపై పగ పెంచుకుని ఇద్దరు పిల్లలతో సహా చంపేశాడని కుటుంబ సభ్యులు తెలిపారు.