తెలంగాణ క్యాబినెట్ సమావేశం..రాజీవ్ యువ వికాసం, రైతు భరోసా నిధులు విడుదలపై చర్చ. !

తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరుగనుంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో నేడు తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరుగనుంది. కాళేశ్వరం విజిలెన్స్, NDSA రిపోర్ట్ పై మంత్రివర్గ భేటీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండనుంది…పవర్ కమిషన్ రిపోర్ట్, ఫోన్ ట్యాపింగ్, ఇతర ఎంక్వైరీలపైనా చర్చించే అవకాశం ఉంది. ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది.

ఒకటి లేదా రెండు డీఏలపై ప్రకటన? ఉంటుంది. రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల ఎంపిక, పథకం అమలుపై చర్చించి నిర్ణయించే అవకాశం ఉంది. వానాకాలం పంటల సాగు, రైతు భరోసాపైనా నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది. పలు పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించనుంది క్యాబినెట్..రాజీవ్ యువ వికాసం పథకంలో ఐదు లక్షల మందికి లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం భావించగా, అంచనాలకు మించి సుమారు 16 లక్షల 50వేల దరఖాస్తులు వచ్చాయి. మొదటి విడతలో లక్ష రూపాయల వరకు కేటగిరి లబ్ధిదారులకు రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ప్రారంభించాలని భావించినప్పటికీ.. గందరగోళం తలెత్తే అవకాశం ఉన్నందున వాయిదా వేశారు. మరికొంతమందికి లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు తీసుకునే అంశంపై చర్చిస్తున్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మొదటి విడత కింద నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇచ్చే విషయంపైనా సమావేశంలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం…