టీటీడీ దర్శనాలకు వాళ్ళని చంద్రబాబును అడుక్కునుడు ఏంది? మనకి మన గుడులు లేవా?
వాళ్లకు టీటీడీ ఉంటే మనకు వైటీడీ ఉంది – రేవంత్ రెడ్డి…
20 ఏళ్లైనా రాజకీయాల్లో తన టెంపర్మెంట్ మార్చుకోలేదని.. మార్చుకోబోనని అన్నారు. ట్రాన్స్ఫార్మ్ కావాలని కొందరు తనకు సలహాలిస్తున్నారు కానీ.. తాను హుందాగా ఉంటే అర్థం చేసుకునే వాళ్లు ఉండాలిగా అంటూ కొట్టిపడేశారు. సీఎంగా ఉంటూ రేవంత్రెడ్డి అలా మాట్లాడుతారా అంటూ ఇన్నాళ్లూ కేటీఆర్, హరీశ్ రావులు చేస్తున్న బ్లేమ్ గేమ్పై ఇలా సూటిగా, సుత్తి లేకుండా కౌంటర్ ఇచ్చారు. తాను మారేదే లేదని.. టెంపర్మెంట్ తగ్గించుకునేదే లేదని తేల్చిపడేశారు రేవంత్. ముఖ్యమంత్రిగా విజ్డమ్లో తన స్కిల్ అప్గ్రేడ్ చేసుకుంటున్నానని చెప్పారు..
రోజుకు 18 గంటలు పని చేస్తున్నానని గుర్తు చేశారు. కేసీఆర్ హయాంలో సచివాలయంలో అడుగు కూడా పెట్టనిచ్చే వారు కాదని.. ఇప్పుడు అదే సెక్రటేరియట్లో బిల్లులు రాలేదని కొందరు ధర్నాలు కూడా చేస్తున్నారని.. తామే అనుమతి ఇవ్వక పోతే సచివాలయంలోకి సామాన్యులు వచ్చే వారా అని నిలదీశారు.
రవీంద్రభారతిలో జరిగిన “ప్రజాపాలనలో కొలువుల పండుగ” సందర్భంగా 922 మందికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక శాఖల్లో కారుణ్య నియామక పత్రాలు అందజేశారు సీఎం రేవంత్రెడ్డి. 10 నెలల్లో 59 వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని చెప్పారు. దేశంలోనే అభివృద్ధికి చిరునామా దక్షిణాది రాష్ట్రాలని.. అందులోనూ తెలంగాణ మరింత ముందుందని అన్నారు. మన రాష్ట్రంలో నిరుద్యోగ శాతం 8 నుంచి 6కు తగ్గిందని.. దేశంలో అతితక్కువగా ధరల పెరుగుదల 1.3 శాతం ఉన్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని లెక్కలు చెప్పారు. ఇదంతా సుపరిపాలనకు నిదర్శనమని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి…
టీటీడీకి ఎమ్మెల్యే లెటర్ అడగాల్సిన అవసరం ఏమిటి..
మనకు భద్రాద్రి రామయ్య లేడా.. యాదాద్రి నరసింహ లేడా.. సోమప్ప శివయ్య లేడా. అంటూ దేవాలయాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించటం విశేషం..