తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ను విడుదల చేశారు. ఈ డాక్యుమెంట్ 83 పేజీలతో ఉంది. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో దీన్ని విడుదల చేశారు..ఇందులో గేమ్ చేంజర్ ప్రాజెక్ట్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. పూర్తిగా కొత్త ప్రమాణాలతో, కొత్త దిశను ఏర్పరచుకుని భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవడంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కీలకమని అందులో పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ అనేక గేమ్ ఛేంజర్ ప్రాజెక్టులను చేపడుతుందని చెప్పారు…
కేసీఆర్ పై పొగడ్తలు..
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ వేదికపైనే అంతకు మించిన ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ వేదికపై పలువురు ప్రముఖులు కేసీఆర్ పాలన అదిరిందహో అంటూ పొగిడేశారు. పదేండ్ల అభివృద్ధిని ప్రశంసించారు. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ఏకంగా అభివృద్ధిలో ‘తెలంగాణ ఒక మాడల్’ అంటూ పొగడ్తలు కురిపించారు. గ్లోబల్ సమ్మిట్లో మంగళవారం బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ వర్చువల్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత.. కేవలం పదేండ్లలోనే అద్భుతమైన వృద్ధిని సాధించిందని కొనియాడారు. దశాబ్దకాలంలోనే జీఎస్డీపీ మూడింతలు పెరిగిందని మెచ్చుకున్నారు. తలసరి ఆదాయంలో దేశంలోనే అగ్రస్థానానికి ఎగబాకిందని ప్రశంసించారు. తెలంగాణ ఒకప్పుడు వెనుకబడిన రాష్ట్రంగా ఉండేదని, ఇప్పుడు టెక్నాలజీ, వ్యవసాయం.. ఇలా ఎన్నో రంగాల్లో ఉన్నత స్థాయిలో నిలిచిందని వివరించారు. తెలంగాణలో సమ్మిళిత వృద్ధి జరిగిందని, మొత్తంగా తెలంగాణ ఒక మాడల్గా ఎదిగిందని ప్రశంసలు కురిపించారు…