తెలంగాణలో కాంగ్రెస్‌ వచ్చాకే తెలంగాణలో ప్రాంతీయ విద్వేషాలు మొదలయ్యాయి..పవన్ కల్యాణ్..

తెలంగాణలో కాంగ్రెస్‌ వచ్చాకే తెలంగాణలో ప్రాంతీయ విద్వేషాలు మొదలయ్యాయి

తెలంగాణలోకి రావద్దనడం నా ప్రాథమిక హక్కుకి భంగం కలిగించడమే

తెలంగాణ ఆవిర్భావం రోజు సభ
పెట్టుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతించలేదు

పదేళ్లలో బీఆర్ఎస్‌ నాయకులు అలా ఎప్పడు మాట్లాడలేదు

13 నెలలుగా నన్ను పర్సనల్‌గా టార్గెట్ చేస్తున్నారు.. మీ అయ్య జాగీరా అనొద్దా?..- ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్..

ఈరోజు (బుధవారం) ఢిల్లీ వేదికగా నేషనల్ మీడియాతో పవన్ కల్యాణ్ మాట్లాడారు. తెలంగాణలో లక్షన్నర మంది సభ్యత్వం జనసేనకు ఉందని ప్రస్తావించారు. వాళ్లు ఉత్సాహంగా ఉన్నప్పుడు.. వారి కోసం పనిచేయొద్దా? అని ప్రశ్నించారు..కర్ణాటక, తమిళనాడులో ఉన్నవారి కోసం ఏమైనా చేయాలి కదా అని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర విభజనకు కాదని.. విభజన జరిగిన తీరుకు తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు. తెలంగాణలోకి తనను రావొద్దనడం తన ప్రాథమిక హక్కుకి భంగం కలిగించినట్లేనని పేర్కొన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ ఏనాడూ ఇలా మాట్లాడలేదని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాకే ప్రాంతీయ విద్వేషాలు మొదలయ్యాయని విమర్శించారు. ‘13 నెలలుగా నన్ను పర్సనల్‌గా టార్గెట్‌ చేస్తే.. తెలంగాణ మీ అయ్య జాగీరా అని అనడం తప్పా?’ అని పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు.