హైదరాబాద్ కు రెయిన్ అలెర్ట్..!

*హైదరాబాద్ కు రెయిన్ అలెర్ట్..

• సంగారెడ్డి వద్ద ఉన్న ఉరుములు, మెరుపులతో కూడిన మేఘాలు హైదరాబాద్ వైపు కదులుతున్నాయి..

• ఆర్సీ పురం, పటాన్‌చెరు, చందానగర్, సర్లింగంపల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం
• గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, మణికొండ, ఖాజాగూడ ప్రాంతాలు కూడా ప్రభావితమయ్యే ఛాన్స్.

• మియాపూర్, కూకట్‌పల్లి పరిసరాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం పడొచ్చు
• రాత్రి 9.15 నుంచి 11 గంటల మధ్య, దక్షిణ హైదరాబాద్‌కు వర్షాలు విస్తరించే అవకాశం..

మియాపూర్, కుకట్ పల్లి పరిసర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం పడొచ్చని, రాత్రి 9గంటలనుంచి 11 మధ్య సిటీలో దక్షిణ ప్రాంతాల్లో కూడా వర్షాలు పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.
నిన్న కురిసిన వర్షానికి సిటీలో పలు ప్రాంతాలు జలమయం కావడంతో ట్రాఫిక్ జామ్ లతో సిటీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు .ఈ క్రమంలో బుధవారం రాత్రి కూడా వర్షాలు కురిస్తాయి.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.