తెలంగాణ శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారయింది..

తెలంగాణ శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారయింది. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి అధికారిక సర్కులర్ జారీ చేశారు. 7వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సభలు ప్రారంభమవుతాయని, శాసనసభ సభ్యులతో పాటు మండలి సభ్యులకు కూడా సమాచారాన్ని అందిస్తూ.. సర్క్యులర్ పంపారు.వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా ప్రాముఖ్యత కలిగిన అంశాలపై ప్రశ్నలు ఇవ్వాలని ఎమ్మెల్యేలకు కార్యదర్శి సూచించారు. 2వ తేదీలోగా వాటిని అందించాలని తెలిపారు. రూల్ 39 ప్రకారం సభ్యులు అడిగే ప్రశ్నలకు సభలో మంత్రులు సమాధానమివ్వాల్సి ఉంటుంది. ముందస్తు ప్రశ్నలను సంబంధిత శాఖలకు పంపి.. తెలంగాణ ప్రభుత్వం సమాధానాలను సిద్ధం చేయనుంది.

ప్రజా ప్రాధాన్యత కలిగిన అంశాలపై అడగాల్సిన ప్రశ్నలను సిద్ధం చేసి సమర్పించాలని ఎమ్మెల్యేలకు సూచించారు.
ఈ ప్రశ్నలను సెప్టెంబరు 2లోపు శాసనసభకు అందించాలని పేర్కొన్నారు. రూల్‌-39 ప్రకారం సభ్యులు అడిగే ప్రశ్నలకు సభలో సంబంధిత మంత్రులు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది.

తెలంగాణలో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్‌లోనే నిర్వహిస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై సభలో విస్తృతంగా చర్చకు సిద్ధమని ప్రతిపక్షాలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. అంతేకాకుండా మాజీ సీఎం కేసీఆర్ కూడా అసెంబ్లీకి వచ్చి ఈ చర్చలో పాల్గొనాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సాగునీటి ప్రాజెక్టులు తదితర అంశాలను లోతుగా చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం మారిన రాజకీయ పరిణామాలు, రగులుతున్న సామాజిక అంశాల నేపథ్యంలో సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభమయ్యే ఈ అసెంబ్లీ సమావేశాలు రాష్ట్ర రాజకీయాల్లోనే అత్యంత కీలకంగా మారనున్నాయి.