రేపు తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త భేటీ
మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్న సమావేశం
ఏపీ జల దోపిడీ, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై మాట్లాడనున్న కేసీఆర్
తెలంగాణ సాగునీటి హక్కుల రక్షణ కోసం ‘మరో ప్రజా ఉద్యమం’ పై కేసీఆర్ దిశానిర్దేశం
పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు 45 టీఎంసీలకే ఒప్పుకోవడంపై తీవ్ర ఆగ్రహం
నాడు బీఆర్ఎస్ 91 టీఎంసీలు కేటాయిస్తే.. నేడు కాంగ్రెస్ కేంద్రం వద్ద మోకరిల్లిందని విమర్శ
నదుల అనుసంధానం పేరుతో ఏపీ జలదోపిడీకి కేంద్రం సహకరిస్తోందని ఆరోపణ
సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై కీలక నిర్ణయాలపై దిశానిర్దేశం చేయనున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.