శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్

శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్

* తిరుమల శ్రీవారిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు.

ఆలయ వైకుంఠ ద్వారాలు
వేకువజామున తెరుచుకోగా కుటుంబసమేతంగా ఆయన
దర్శనానికి వెళ్లారు.

రేవంత్ వెంట ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ తదితరులు ఉన్నారు.

2 గంటల నుంచే ఉత్తర ద్వారదర్శనార్థం ఆలయాలకు క్యూ కట్టారు. తిరుమలలో సోమవారం అర్థరాత్రి తర్వాత 1.30 గంటల నుంచి వైకుంఠద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. తొలుత వీఐపీలు వైకుంఠద్వారం గుండా శ్రీవారిని దర్శించుకుంటున్నారు. సాధారణ భక్తులకు ఉదయం 6 గంటల నుంచి దర్శనాలు కల్పించనున్నారు..తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని, ఉత్తర ద్వారం గుండా బయటకు వచ్చారు. సోమవారం రాత్రే తిరుమలకు చేరుకున్న సీఎం, కుటుంబ సభ్యులకు ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా స్వాగతం పలికారు. ఆలయానికి వచ్చిన సీఎం, కుటుంబ సభ్యులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఇతర అధికారులు స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. తిరుమల గిరులు, ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి… భక్తులు కూడా భారీ సంఖ్యలను స్వామివారి దర్శనానికి వేచి ఉన్నారు..

గమనిక..
A TO Z వార్తలు ఏదైనా..
మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959