ఢిల్లీ వేదికగా రేపటి నుండి హీటెక్కనున్న తెలంగాణా కాంగ్రెస్ రాజకీయాలు.
_• ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి._
_• రెండు,మూడు రోజుల పాటు ఢిల్లీలోనే రేవంత్ రెడ్డి._
_• విదేశీ పర్యటన ముగించుకొని ఇవాళ ఢిల్లీకి చేరుకోనున్న కేసి వేణుగోపాల్.._
_• మద్యాహ్నం చత్తీస్గఢ్ కు వెళ్లనున్న కే.సి వేణుగోపాల్._
_• ఇవాళ రాత్రికి ఢిల్లీకి వెళ్లనున్న భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మమేష్ కుమార్ గౌడ్, డి. శ్రీధర్ బాబు…_
_• రేపు వైఎస్ఆర్ వర్దంతి సందర్భంగా కెవిపి అధ్వర్యంలో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం లో సిఎం తో పిసిసి,డిప్యూటీ సిఎం, మంత్రులు, ముఖ్య నేతలు పాల్గొంటారు…_
_• రాష్ట్ర రాజకీయ పరిణామాలతో పాటు మంత్రి కొండాసురేఖ అంశమే ప్రధాన చర్చ…_
_• సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, మహేష్ కుమార్ గౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి , డి.శ్రీధర్ బాబు, పార్టీ రాష్ర్ట వ్యవహారాల ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ లతో కీలక భేటీలు నిర్వహించనున్న ఏఐసిసి పెద్దలు._
_• కొండ సురేఖ, చిన్నా రెడ్డి వ్యవహారాలపై ఇప్పటికే అధిష్టానికి నివేదికలు._
_• మంత్రులు, ఎంపీలు, ఎంఎల్ఎ లు సహా ఇతర నేతల అభిప్రాయ సేకరణ నివేదికను కొద్ది రోజుల కిందట అధిష్టానికి అందజేసిన మీనాక్షి నటరాజన్._
_• మొత్తం పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలపై తెలంగాణా నేతలతో చర్చించనున్న కేసీ తో పాటు ఖర్గే, రాహుల గాంధీ._
_• ఢిల్లీ సమావేశాల తరువాత తెలంగాణా పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం అంటున్న ఏఐసిసి వర్గాలు._
*• కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ తప్పనిసరి అంటున్న ఏఐసిసి వర్గాలు*
_• అయితే 7నుండి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు ముందా లేదా తరువాతే అనేది రాష్ర్ట నేతలతో కీలక సమావేశాల అనంతరమే స్పష్టత వచ్చే అవకాశం._