తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్.

తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్.

హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాలకు వర్ష సూచన
గంటకు 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన..

తెలంగాణలో రానున్న 24 గంటల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని తెలిపింది..

అదే సమయంలో రాష్ట్రంలోని ఉత్తర జిల్లాలైన ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ..

వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేకపోతే బయటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. ఉరుములు, మెరుపుల సమయంలో చెట్ల కింద నిలబడకుండా జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు..

గంటలు వాహనాలు రోడ్లపై నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా రాత్రి కురిసిన వర్షానికి ఉప్పల్‌-నారపల్లి ఫ్లైఓవర్‌ ఆలస్యం కారణంగా రోడ్లపై భారీగా వరద నిలిచింది..నీటిని మోటర్లు పెట్టి మరీ ఎత్తిపోయడం నగర పరిస్థితికి అద్దం పట్టింది. 2018 జూలైలో ప్రారంభమైన ఫ్లైఓవర్‌ పనులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా స్థానికులతోపాటు వాహనదారుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు..