ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన తెలంగాణ కేబినెట్(Telangana Cabinet) సమావేశం ముగిసింది..పలు అంశాలపై ఐదు గంటలకు పైగా చర్చించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా స్పోర్ట్స్ పాలసీ(Sports Policy)కి ఆమోదించారు. కాగా, అద్భుతమైన క్రీడాకారులను తీర్చిదిద్దటంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు గుర్తింపు తెచ్చేలా కొత్త క్రీడా విధానం తయారు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. 2036 ఒలింపిక్స్ను దృష్టిలో పెట్టుకొని కొత్త పాలసీలో లక్ష్యాలను నిర్దేశించుకోవాలని తెలిపారు. ఇప్పటికే కొత్త స్పోర్ట్ పాలసీ ముసాయిదాపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, ఏపీ జితేందర్ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనా రెడ్డితో పాటు ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై సమీక్షించారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వివిధ దేశాలు, ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను ప్రధానంగా చర్చించి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు..
ఉజ్జయినీ మహంకాళి బోనాల ఉత్సవాలు..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉజ్జయినీ మహంకాళి బోనాల ఉత్సవాల ఆహ్వాన పత్రికని మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఉజ్జయినీ మహంకాళి ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందించారు. జూలై 13వ తేదీన సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాలు జరుగనున్నాయి..