కాంట్రాక్ట్ ఉద్యోగులపై నీళ్లు.
*వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు ఔట్..
*తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు!.
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ జీవో రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. జీవో 16ను హైకోర్టు కొట్టేసింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ రాజ్యాంగ విరుద్ధమని తెలిపింది. జీవో 16 ద్వారా వేలాది మందిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది.
.విద్య, వైద్య శాఖల్లోనే ఎక్కువ మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజ్ అయ్యారు. హైకోర్టు ఆర్డర్తో వారంతా ఆందోళనలో ఉన్నారు. రెగ్యులరైజ్ అయినవారిని తిరిగి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా కొనసాగించవచ్చని కోర్టు ఆదేశాలు ఇచ్చిందని పిటిషనర్లు చెబుతున్నారు. కోర్టు ఆర్డర్ కాపీ వస్తే స్పష్టత వస్తుందదని అధికారులు అంటున్నారు…