నేటి నుండి ఇంటర్ పరీక్షలు..ఐదు నిమిషాలు ఆలస్యమైన పరీక్ష హలులోకి అనుమతి..!!
• తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
• ఈ క్రమంలో విద్యార్థులకు రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి (TG BIE) భారీ ఊరటనిచ్చింది. సాధారణంగా హాల్ టికెట్ పై కళాశాల ప్రిన్సిపాల్ సంతకం తప్పనిసరి అనే నిబంధన ఉన్నప్పటికీ,ఈసారి విద్యార్థులు ఆన్లైన్ నుండి డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లపై సంతకం లేకపోయినా పరీక్షా కేంద్రంలోకి అనుమతించాలని అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
• కాగా ఉదయం 09:05(ఐదు నిమిషాలు ఆలస్యం ఐనా పరీక్ష హలులోకి అనుమతిస్తామని తెలిపారు.అయితే అరగంటముందే పరీక్ష కేంద్రానికి విద్యార్థులు చేరుకోవాలని సూచించారు..!!
సాధారణంగా హాల్ టికెట్ పై కళాశాల ప్రిన్సిపాల్ సంతకం తప్పనిసరి అనే నిబంధన ఉన్నప్పటికీ,ఈసారి విద్యార్థులు ఆన్లైన్ నుండి డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లపై సంతకం లేకపోయినా పరీక్షా కేంద్రంలోకి అనుమతించాలని అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.కాగా ఉదయం 09:05(ఐదు నిమిషాలు ఆలస్యం ఐనా పరీక్ష హలులోకి అనుమతిస్తామని తెలిపారు. అయితే అరగంటముందే పరీక్ష కేంద్రానికి విద్యార్థులు చేరుకోవాలని సూచించారు.. ట్రాఫిక్ సమస్యలు లేదా ఇతర అనివార్య కారణాల వల్ల పరీక్షా కేంద్రాలకు చేరుకోవడంలో స్వల్పంగా ఆలస్యమయ్యే విద్యార్థులలో ఒత్తిడిని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు అధికారులు వెల్లడించారు.
గతంలో అమల్లో ఉన్న ‘ఒక్క నిమిషం నిబంధన’పై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న బోర్డు, ఈసారి నిబంధనలను కొంత సడలించింది. దీని ప్రకారం, ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కానుండగా, 9:05 గంటల వరకు వచ్చే అభ్యర్థులను కూడా హాల్లోకి అనుమతిస్తారు. అయితే, పరీక్ష సమయం మాత్రం యధావిధిగా ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది.
ముగింపు సమయాన్ని 9:05 గంటల వరకు పొడిగించినప్పటికీ, విద్యార్థులు దీనిని ఆఖరి నిమిషం వరకు వేచి చూసే అవకాశంగా భావించకూడదని బోర్డు స్పష్టం చేసింది. పరీక్షా కేంద్రాల వద్ద తనిఖీలు, హాల్ టికెట్ల పరిశీలన వంటి ప్రక్రియలు సజావుగా సాగాలంటే అభ్యర్థులు కనీసం 15 నిమిషాల ముందుగానే అంటే ఉదయం 8:45 గంటలకే కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.