తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం పంచాయతీ రాజ్ శాఖ సన్నాహాలు..

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం పంచాయతీ రాజ్ శాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యూన్సీలు (ZPTC), మండల పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యూన్సీల (MPTC), పంచాయతీ స్థానాల సంఖ్యను ఖరారు చేసింది. మొత్తం 566 జడ్పీటీసీ, మండల ప్రజా పరిషత్ (MPP) స్థానాలు, అలాగే 5,773 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది..పంచాయతీల సంఖ్య..

ఇదే సమయంలో రాష్టంలో గ్రామ పంచాయతీల సంఖ్య 12,778 ఉండగా, వార్డుల సంఖ్య 1,12,000గా ఉంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే, 2019లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అప్పటి ఎన్నికల్లో ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు 570 ఉండగా, ఎంపీటీసీ స్థానాలు 5,817, గ్రామ పంచాయతీలు 12,848గా ఉన్నాయి. ఈ నిర్ణయం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం చేసిందని చెప్పవచ్చు.