Telangana Municipal Elections :
February 2026, as the current council’s term ends on February 11, 2026.
గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి.
రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతోంది. విద్యార్థులకు పరీక్షల సీజన్ మొదలయ్యేలోపు అంటే ఫిబ్రవరి రెండో వారం నాటికి ఎన్నికలు పూర్తి చేయాలని చూస్తోంది. జనవరి మూడో వారం నాటికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషన్కు సూచించినట్లు సమాచారం. సర్కారు సూచనల మేరకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు సైతం మొదలుపెట్టారు.
రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు,9 కార్పొరేషన్లకు గడువు జనవరితో ముగిసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అవి ప్రత్యేక అధికారుల పాలనలో నడుస్తూ వస్తున్నాయి. జీహెచ్ఎంసీతో పాటు ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ల గడువు వచ్చే ఫిబ్రవరితో ముగియనుంది. హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేకంగా సర్కార్ దృష్టి పెడుతున్నట్లుగా అధికార పార్టీ మంత్రులు చెప్పుకొస్తున్నారు.. ఓఆర్ఆర్ పరిధిలోని 27 మున్సిపాల్టీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా కొన్ని నగర పంచాయతీలు మున్సిపాల్టీలుగా, కొన్ని మున్సిపాల్టీలను కార్పొరేషన్లుగా రాష్ట్ర ప్రభుత్వం మార్చింది.
జీహెచ్ఎంసీతో మిగతా పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు? : ప్రస్తుతం రాష్ట్రంలో జీహెచ్ఎంసీతో కలిపి 8 కార్పొరేషన్లు, 125 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఫిబ్రవరితో గడువు ముగియనున్న జీహెచ్ఎంసీతో సహా మిగతా పట్టణ స్థానిక సంస్థలన్నింటికీ ఒకేసారి ఎన్నికలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలో ఉంది. ఇందుకు విద్యార్థుల పరీక్షల సీజన్ మొదలయ్యేలోగా ఎన్నికల నగరా ముగించాలని చూస్తోంది. ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లు, మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల్లోని 2 మున్సిపాలిటీల పాలక వర్గాలకు ఏప్రిల్ వరకు గడువు ఉన్నందున వాటిని మినహాయించవచ్చని తెలుస్తోంది. త్వరలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ మున్సిపాలిటీల్లో ఓటరు జాబితా సిద్ధం చేసే పనిలో నిమగ్నం కానుంది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా సిద్ధంగా ఉండేందుకు జనవరి రెండో వారం నాటికి ఓటర్ల జాబితా తయారీకి సన్నాహాలు సైతం చేస్తున్నారు.
రూ.2,780 కోట్ల నిధులు మంజూరు : ఎన్నికల దృష్ట్యా పట్టణ స్థానిక సంస్థల్లో అభివృద్ధి కోసం అక్టోబరులో ప్రభుత్వం రూ.2,780 కోట్ల నిధులను విడుదల చేసింది. జీహెచ్ఎంసీ మినహా మిగతా అన్ని పట్టణ స్థానిక సంస్థలకు విడుదలైన నిధుల ద్వారా 2,432 పనులు చేయనున్నారు. కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీకి రూ.15 కోట్లు, శివార్లలోని గ్రామ పంచాయతీలను విలీనం చేసుకున్న మున్సిపాలిటీలకు రూ.20 కోట్లు, కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్లకు రూ.30 కోట్ల చొప్పున అదనంగా మంజారు చేశారు..
గమనిక..
మీ ప్రాంతాల్లో
A TO Z వార్తలు ఏదైనా..
మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959