తెలంగాణ : మరికాసేపట్లో భారీ వర్షాలు కురిసే అవకాశం..!

తెలంగాణ : మరికాసేపట్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్న 2 గంటల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురవనున్నట్లు HYD వాతావరణ కేంద్రం తెలిపింది. సిద్దిపేట, మెదక్, జనగామ, యాదాద్రి, మహబూబ్ నగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈ ఆకస్మిక వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. రైతులు ఎవరూ చెట్ల కింద నిలబడకూడదని హెచ్చరించింది. ఇప్పటికే హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి.