*🔹హైదరాబాద్ అర్థరాత్రి భారీ వర్షం…*
_TG:- రాష్ట్రంలో అర్ధరాత్రి పిడుగులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది…_
_• హైదరాబాద్ తో సహా ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ వర్షం కురిసింది.. దీంతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి…_
కొన్నిచోట్ల వడగండ్లు పూర్వక పంట నష్టం ఏర్పడింది… ఈదురుగాలిలో *వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు…* ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని సిఎస్ శాంతి కుమారి జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు..
అలాగే ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్ధిపేట, యాదాదరి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ ప్రాంతాల్లో గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు ఉంటుందని తెలిపింది. రేపు కూడా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. నిన్న అర్ధరాత్రి పిడుగులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. హైదరాబాద్తో సహా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొన్ని చోట్ల వడగండ్లు కురవగా పంట నష్టం ఏర్పడింది. ఈదురుగాలులు, వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని సీఎస్ శాంతికుమారి జిల్లాల యంత్రాంగాన్ని ఆదేశించారు.