తెలంగాణ తల్లి రూపం మార్చరాదని, ఇప్పటికే ఉన్న విగ్రహాల స్థానంలో కొత్తగా రూపొందించిన వాటిని ఏర్పాటు చేయకుండా ఆదేశాలివ్వాలని దాఖలు చేసిన పిటిషన్ను జూలూ రు గౌరీశంకర్ ఉపసంరించుకున్నారు…ఈ పిటిషన్ మంగళవారం చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావు ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది మయూర్రెడ్డి వాదిస్తూ విగ్రహాలను మార్చడం వల్ల దాదాపు రూ.150 కోట్లు ప్రజాధనం వృధా అవుతుందని పేర్కొన్నారు. అయితే అఫిడవిట్ సరిగా లేదని, ఏ నిర్ణయాన్ని సవాల్ చేస్తున్నారు… పిటిషనర్ వివరాలు ప్రొసీజర్ ప్రకారం లేవని హైకోర్టు పేర్కొంది. విగ్రహాలు మార్చాలన్న క్యాబినెట్ నిర్ణయం ఎక్కడ ఉందనే ప్రస్తావన లేదని వ్యాఖ్యానించింది. సరైన అఫిడవిట్తో పిటిషన్ మళ్లీ దాఖలు చేస్తామని, ప్రస్తుత పిటిషన్ ఉపసంహరించుకుంటామని పిటిషనర్ పేర్కొనడంతో హైకోర్టు అనుమతించింది…
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.